Hero Vijay Sethupathi-Puri :పూరీ సేతుప‌తి మూవీలో విల‌న్ క‌న్ ఫ‌ర్మ్ 

క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ కి ఛాన్స్ 

Vijay Sethupathi : డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ దూకుడు పెంచాడు. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తితో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇందు కోసం హీరోయిన్ల‌తో పాటు విల‌న్ , త‌దిత‌ర పాత్ర‌ల‌కు సంబంధించి ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డాడు. తాజాగా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. క‌న్న‌డ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు దునియా విజ‌య్ త‌మ టీంలో చేరుతున్న‌ట్లు తెలిపాడు. త‌నను ప్ర‌త్యేకించి విల‌న్ పాత్ర కోసం తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి ట‌బు కూడా న‌టిస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ వెల్ల‌డించాడు.

Vijay Sethupathi – Puri Jagannadh Movie Vilan..

విజ‌య్ సేతుప‌తికి(Vijay Sethupathi) జోడీగా మ‌ల‌యాళ సినీ న‌టి నివేదా థామ‌స్ ను తీసుకుంటున్న‌ట్లు టాక్. కానీ ఆమె ఎంపిక గురించి ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు. ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు పెరిగాయి. ఓ వైపు వ‌రుస సినిమాలు ప్లాప్ అయిన‌ప్ప‌టికీ విజ‌య్ సేతుప‌తి పూరీ జ‌గ‌న్నాథ్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేశాడు. తాను ఫెయిల్యూర్ గురించి ప‌ట్టించుకోన‌ని, కేవ‌లం క‌థ బాగుంటే చాల‌ని అందుకే ఓకే చెప్పాన‌ని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ నంద‌మూరి న‌ట‌సింహం న‌టించిన వీర సింహా రెడ్డిలో విల‌న్ గా మంచి మార్కులు కొట్టేశాడు. త‌ను పూరీ, సేతుప‌తి మూవీలో బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ బోతున్నాడ‌ని, ఇది సినిమాకు హైలెట్ అవుతుంద‌న్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. త‌ను తీసిన లైగ‌ర్, ఇస్మార్ట్ శంక‌ర్ 2 ఆశించిన మేర ఆడ‌లేదు. అయినా సేతుప‌తితో మూవీ క‌న్ ఫ‌ర్మ్ కావ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించేలా చేసింది.

Also Read : L2 Empuraan Sensational :రూ. 260 కోట్ల వ‌సూలుతో ఎంపురాన్ రికార్డ్
Cinemapuri jagannadhUpdatesVijay SethupathiViral
Comments (0)
Add Comment