Eagle Movie Teaser : మాస్ మ‌హ‌రాజా డైలాగ్స్ అదుర్స్

లావాను దించొద్దు ఊరుండదు నువ్వుండ‌వు

Eagle Movie Teaser : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టించిన ఈగిల్ (డేగ‌) మూవీకి సంబంధించి టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టికే గ‌జ దొంగ నేప‌థ్యంతో నుపుర్ స‌న‌న్ తో క‌లిసి న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు ఆశించిన మేర సంతృప్తిని ఇచ్చింది.

తాజాగా మ‌రో సినిమాతో ముందుకు వ‌చ్చాడు ర‌వితేజ‌(Ravi Teja). ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇక ఈగిల్ మూవీలో ఆక‌ట్టుకునేలా ఉన్నాయి డైలాగులు.

Eagle Movie Teaser Updates

కొండ లోని లావా లాంటి వాడిని . కింద‌కు పిల‌వ‌ద్దు. ఎందుకంటే అది వ‌స్తే ఊరు ఉండ‌దు..చివ‌ర‌కు నువ్వూ ఉండ‌వు అంటూ ర‌వితేజ విసిరిన డైలాగ్ గుండెల్లో గుచ్చుకునేలా ఉంది.

ఈ కొత్త చిత్రానికి ఘ‌ట్ట‌మ‌నేని కార్తీక్ ద‌ర్శ‌కుడు. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ కీ రోల్ పోషించింది. ఇందులో ద‌ర్శ‌కుడు ర‌వితేజ‌ను కొత్త గెట‌ప్ లో చూపించాడు. దీంతో ఫ్యాన్స్ తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు.
ఇందులో మ‌రికొన్ని డైలాగులు కూడా ఆలోచింప చేసేలా ఉన్నాయి.

అరే అడ‌విలో ఉన్నాడు..కానీ ఎక్క‌డా క‌నిపించ‌డు..అయినా త‌రిచి చూస్తే మొత్తంగా క‌నిపిస్తాడంటూ డైలాగ్ పేల్చాడు. ఇంకా అత‌డి బుల్లెట్ ఎక్క‌డికైనా వెళుతుంది. చూస్తావా పేల్చ‌మంటావా..విధ్వంసం మాత్ర‌మే త‌ర్వాత క‌నిపిస్తుంది విశ్వం అస‌లైన రూపం అని. వ‌చ్చే ఏడాది 2024 జ‌న‌వ‌రి న విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read : Sara Ali Khan : క్రికెట‌ర్ తో డేటింగ్ పై కామెంట్

Comments (0)
Add Comment