Eagle Movie Teaser : ర‌వితేజ ఈగ‌ల్ టీజ‌ర్ రెడీ

అప్ డేట్ ఇచ్చిన మూవీ మేక‌ర్స్

Eagle Movie Teaser : తెలుగు సినిమా రంగంలో మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌ను తాజాగా న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు ఆశించిన రీతిలో ఆద‌ర‌ణ పొందింది. త‌న నుంచి మ‌రో చిత్రం వ‌స్తోంది. అదే ఈగ‌ల్ మూవీ. త‌న అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పారు హీరో. సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Eagle Movie Teaser Release Updates

మాస్ మ‌హ‌రాజాతో పాటు ఫిమేల్ పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ఇందులో భాగంగా మూవీ మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. ఈగ‌ల్ టీజ‌ర్ ను సోమ‌వారం ఉద‌యం రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న అంగ‌రంగ వైభవంగా విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మూవీ మేక‌ర్స్. ఇక పండుగ చేసుకునేందుకు మాస్ మ‌హ‌రాజా(Ravi Teja) అభిమానులు సిద్దంగా ఉండాల‌ని , మీరు ఊహించని దానిక‌న్నా ఎక్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు మూవీ మేక‌ర్స్.

ఇక ఈగ‌ల్ లో అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకుంటుంద‌నే త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ర‌వి తేజ త‌న‌లోని మ‌రో న‌టుడిని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. మొత్తంగా ఈగ‌ల్ ఏ మేర‌కు అల‌రిస్తుందో వేచి చూడాలి.

Also Read : keeda Cola Collections : కీడా కోలా వ‌సూళ్ల వేట

Comments (0)
Add Comment