Emraan Hashmi: అడివి శేష్‌ ‘జీ2’ లో ఇమ్రాన్‌ హష్మి ?

అడివి శేష్‌ ‘జీ2’ లో ఇమ్రాన్‌ హష్మి ?

Emraan Hashmi: ‘మేజర్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం అడవి శేష్… 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన గుఢాచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘జీ 2’ (గుఢాఛారి 2) సినిమాలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకె ఎంటర్టైన్ మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అడవి శేష్ కథను అందిస్తున్నారు. స్పై, యాక్షన్, థ్రిల్లర్ గా ఐదు దేశాల్లో షూటింగ్ చేసుకోబోయే ఈ సినిమాలో అడవి శేష్ సరసన బనితా సంధు నటిస్తున్నారు. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది.

Emraan Hashmi Movie Updates

అయితే ఈ సినిమాలో ప్రతినాయకుని పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించడంతో ఇమ్రాన్ హష్మి అయితే ప్రతినాయకుడి పాత్రకు న్యాయం జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంట. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ హష్మీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో ఒకటి రెండు రోజుల్ల అధికారికంగా ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి పాత్ర గురించి చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

బాలీవుడ్ లో కింగ్ ఆఫ్ రొమాన్స్ గుర్తింపు పొందిన ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)… ఇటీవల స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన టైగర్ 3 తో హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ… సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు ‘జీ2’ లో కూడా ఇమ్రాన్‌ హష్మి నటిస్తే… తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో కూడా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Also Read : Keerthy Suresh: ఫిబ్రవరి 16న కీర్తి సురేశ్‌ ‘సైరెన్‌’ !

adivi seshEmraan Hashmig2
Comments (0)
Add Comment