Extra Ordinary Man : నితిన్..శ్రీ‌లీల య‌మ క్రేజ్

మూవీ మేక‌ర్స్ ఫుల్ కాన్ఫిడెంట్

Extra Ordinary Man : ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ మూవీకి సంబంధించి రెండో పాట రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఈ మూవీలో యంగ్ యాక్ట‌ర్ నితిన్ రెడ్డి, ల‌వ్లీ గ‌ర్ల్ శ్రీ‌లీల(Sree Leela) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికీ సినిమాకు సంబంధించి టీజ‌ర్ రిలీజ్ చేశారు.

Extra Ordinary Man Movie Viral

తాజాగా చిత్రంలోని రెండో సాంగ్ సింగిల్ ను విడుద‌ల చేశారు. మంచి ఆద‌ర‌ణ ల‌బిస్తోంది. ఈ సింగిల్ పేరు బ్ర‌ష్ వేసుకో. ఈ ఈవెంట్ ను హైద‌రాబాద్ లోని సీఎంఆర్ క‌ళాశాల‌లో చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజ‌ర‌య్యారు.

ఈ చిత్రానికి మినిమం గ్యారెంటీ పేరున్న ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పెద్ద‌పులి రావ‌మ్మా అనే తెలంగాణ జాన‌ప‌ద గీతానికి నితిన్ రెడ్డి స్టెప్పులు వేశాడు. అదుర్స్ అనిపించేలా చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

ఇదే మూవీకి గాను డేంజ‌ర్ పిల్లా అనే పేరుతో రిలీజ్ చేసిన సాంగ్ కు య‌మ క్రేజ్ ల‌భించింది. హీరో హీరోయిన్ల‌ను డిఫ‌రెంట్ గా ప్ర‌జెంట్ చేయ‌డంతో చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి ఫ్యాన్స్ కు. ప్ర‌స్తుతం శ్రీ‌లీల ఉంటే చాలు సినిమా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం సినిమా వ‌ర్గాల‌లో నెల‌కొంది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ పాప వెంట ప‌డుతున్నారు.

Also Read : Mrunal Thakur Viral : అంద‌రి క‌ళ్ల‌న్నీ అందాల పైనే

Comments (0)
Add Comment