రష్మిక బర్త్ డే రోజు వస్తున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ !
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. అందులో భాగంగా ఫ్యామిలీ స్టార్‌తో కిట్టీ పార్టీ అంటూ ఇండిస్ట్రీకి చెందిన కొందరు నటీమణులతో విజయ్ దేవరకొండ చిట్‌చాట్ జరిపారు.
ఈ సందర్భంగా సినిమా విడుదల విషయంలో విజయ్‍కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది కదా… ఆ తేదీన ఏదైనా విశేషం ఉందా ? అని విజయ్ దేవరకొండను ఓ నటి అడిగారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ విడుదల చేయడానికి ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉండటమే అని విజయ్ దేవరకొండ చెప్పారు. దీనితో అక్కడ ఉన్న వారు నవ్వడం ప్రారంభించారు. ‘యాదృచ్ఛికంగా ఎప్రిల్ 5న ఇంకేదో ఉంది… అదే రష్మిక మందన్న పుట్టినరోజు అనుకుంటా’ అని మరోకరు అన్నారు.
దీనికి విజయ్ మాట్లాడుతూ.. ‘అవును ఆరోజున రష్మిక పుట్టినరోజు ఉంది. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నాను.’ అని అన్నారు. వాస్తవంగా ఏప్రిల్ 5,6,7 తేదీలు వీకెండ్‌తో ముగుస్తాయి. ఆ తర్వాత వెంటనే ఉగాది, రంజాన్ పండుగలు ఒకే వారంలో ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ స్టార్‌కు కలెక్షన్స్ పరంగా బాగా కలిసొస్తుందని విజయ్ పేర్కొన్నాడు. విజయ్- రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5వ తేదీన రష్మిక పుట్టినరోజు ఉంది.. సినిమా కూడా అదేరోజున విడుదల కానున్నడం ఇప్పుడు వారి ప్రేమ విషయం మరింత ఆసక్తిగా మారింది.