Beauty Trisha Temple :అభిమాన సంధ్రం త్రిష‌కు మందిరం

గుడి క‌డతానంటూ సోష‌ల్ మీడియాలో

Trisha : ప్రేమ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. యావ‌త్ ప్ర‌పంచం ల‌వ్ కోసం ఆస్తుల‌ను, రాజ్యాల‌ను వ‌దిలేసుకున్నారు. లెక్క‌కు మించి వ‌జ్రాలు, వైఢూర్యాలు, బంగారం, వెండిని సైతం కాద‌నుకున్నారు. త‌మ అభిమాన ప్రియురాలిని మెప్పించేందుకు, ఆమెను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు. ముంతాజ్ ప్రేమ‌కు గుర్తుగా ఏకంగా తాజ్ మ‌హ‌ల్ ను నిర్మించాడు. దానికి రాళ్లు ఎత్తిన కూలీలు ఎవ‌రంటూ ప్ర‌శ్నించాడు మ‌హా క‌వి శ్రీ‌శ్రీ‌.

Trisha Fans Build a Temple

ఇక సినిమా రంగానికి వ‌స్తే చాలా మంది అభిమానులు త‌మ న‌టీమ‌ణుల ప‌ట్ల మ‌రింత ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తుంటారు. అంత‌కు మించి అభిమానాన్ని చాటుకుంటారు. ఈ పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లేలా చేస్తుంది త‌మిళనాడులో. గ‌తంలో ఎంద‌రికో గుళ్లు క‌ట్టారు. ప్ర‌త్యేకించి జ‌య‌ల‌లిత విష‌యంలో. ఆమెకు బ‌తికి ఉన్న స‌మ‌యంలోనే భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి నిర్మించారు ఆల‌యాన్ని. నిత్యం అక్క‌డ పూజ‌లు కొన‌సాగుతున్నాయి. అంతే కాదు మ‌రో సూప‌ర్ హీరోయిన్ గా పేరు పొందిన న‌టి ఖుష్బూ.

త‌న కోసం కూడా అక్క‌డ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. త‌న పేరుతో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పూజ‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా మ‌రో న‌టి ఆ జాబితాలో చేరింది . ఆమె ఎవ‌రో కాదు అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణ‌న్(Trisha). సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఫ్యాన్ ఏకంగా త్రిష‌కు ప్ర‌పోజ్ చేశాడు. తాను నిజ జీవితంలో త‌న‌ను పొంద‌లేన‌ని, కానీ హృద‌యంలో మాత్రం ఆమెకు అంద‌మైన గుడిని తాజ్ మ‌హ‌ల్ కంటే గొప్ప‌గా నిర్మిస్తానంటూ ప్ర‌క‌టించాడు. త‌ను చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపుతున్నాయి.

Also Read : Renu Desai Shocking :వ్యూస్ కోసం ఇంత‌లా దిగ‌జారి పోతే ఎలా..?

Trisha KrishnanUpdatesViral
Comments (0)
Add Comment