Faria Abdullah : టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) సంచలన వ్యాఖ్యలు చేసింది. తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ జాతిరత్నాలుతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అది పూర్తిగా కామెడీ, ఎంటర్ టైనర్ గా అలరించింది. బిగ్ సక్సెస్ అయ్యాక తనకు భారీగా ఛాన్స్ లు వస్తాయని అనుకున్నారు అందరూ. కానీ సీన్ రివర్స్ అయ్యింది. తను కూడా ఎంతో హోప్స్ పెట్టుకుంది. కానీ వర్కవుట్ కాలేదు. గెస్ట్ రోల్, స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం తమిళంలో నటిస్తోంది కీ రోల్ పోషిస్తోంది. దీనిపై గంపెడు ఆశలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Faria Abdullah Shocking Comments
తన అంద చందాలతో, డ్యాన్సులతో హోరెత్తిస్తోంది ఈ లవ్లీ బ్యూటీ. ఈ సందర్బంగా ప్రముఖ యాంకర్ సుమ నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో తాజాగా ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) తన మనసులో మాట బయట పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ హీరో అక్కినేని నాగార్జున, పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కోరికను వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేయాలని ఉందని, నాగ్ తో లవ్ చేయాలని ఉందని, డార్లింగ్ ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చెప్పింది.
ఆరడుగుల బుల్లెట్ అంటూ తన గురించి ఫ్యాన్స్ చెప్పుకోవడం విశేషం. తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సొగసు, అందం కలగలిసిన ఈ లవ్లీ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సూపర్ బ్యూటీతో యంగర్స్ కు, కుర్రాళ్లకు , యూత్ కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో తను ఫుల్ బిజీగా ఉంటుంది. నెటిజన్స్ తో నిత్యం ఇంటరాక్ట్ అవుతూ వుంటుంది. ఫరియా అబ్దుల్లా ఇప్పటి వరకు జాతి రత్నాలుతో పాటు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ , లైక్ షేర్ సబ్ స్క్రైబ్ , రావణాసురలో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. ఆ ఒక్కటి అడుక్కు, కల్కి 2898, మత్తు వదలరా2 చిత్రాలలో నటించింది.
Also Read : Hero Dulquer-Bhagyashri :పీరియాడిక్ మూవీగా సెల్వరాజ్ ‘కాంత’