Faria Abdullah : పెళ్లి పీటలెక్కనున్న జాతిరత్నాలు బ్యూటీ ఫరియా

చిట్టికి కాబోయే వరుడు కూడా చిత్ర పరిశ్రమలో నటుడే కావడం విశేషం

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టి మన ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోబోతుందా? ఆమె ఒంటరి జీవితానికి వీడ్కోలు చెప్పి తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవుననే సమాధానం వస్తుంది.

Faria Abdullah Marriage Updates

‘జాతి రత్నాలు’ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా హైదరాబాద్ కు చెందిన ఫరియా అబ్దుల్లా ఎంపికైంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించింది. ఫరియా అబ్దుల్లా త్వరలో పెళ్లి చేసుకోనుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫరియా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

చిట్టికి కాబోయే వరుడు కూడా చిత్ర పరిశ్రమలో నటుడే కావడం విశేషం. ప్రస్తుతం ఓ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫరియా పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై చిట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read : Mix Up Movie OTT : సడన్ గా ఆ ఓటీటీలో ప్రత్యక్షమైన రొమాంటిక్ మూవీ మిక్స్ అప్

Faria AbdullahmarriageTrendingUpdatesViral
Comments (0)
Add Comment