Thalapathy Vijay Shocking -Fatwa :ద‌ళ‌ప‌తి విజ‌య్ పై క‌న్నెర్ర ఫ‌త్వా జారీ

జారీ చేసిన ఆల్ ఇండియా ముస్లిం బోర్డు

Thalapathy Vijay : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కి షాక్ త‌గిలింది. ఆల్ ఇండియా ముస్లిం జ‌మాత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌పై ఫ‌త్వా జారీ చేసింది. ముస్లింల మ‌నోభావాలు దెబ్బ తినేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించింది. ఈ మేర‌కు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆల్ ఇండియా ముస్లిం జ‌మాత్ జాతీయ చీఫ్ మౌలానా ష‌హ‌బుద్దీన్ ర‌జ్వీ. ఇఫ్తార్ విందుకు ముస్లింలు కాని వాళ్ల‌ను, రౌడీల‌ను, ఆవారాగాళ్ల‌ను పిలిచారంటూ ఆరోపించారు. మొత్తంగా ముస్లిం స‌మాజాన్ని ద‌ళ‌ప‌తి విజ‌య్ అవ‌మానించార‌ని, ఆయ‌న‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని కూడా కోరారు.

Thalapathy Vijay Shocking

ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్(Thalapathy Vijay) పై జారీ చేసిన ఫ‌త్వా క‌ల‌కం రేపింది. త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే డీఎంకే ప‌వ‌ర్ లో ఉండ‌గా అన్నాడీఎంకే, భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామంటూ ప్ర‌క‌టించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్ర‌బుల్ షూటర్ అమిత్ చంద్ర షా చెప్పారు. ఇదే స‌మ‌యంలో ర‌జ్వీ మ‌రో కీల‌క కామెంట్స్ చేశాడు. అదేమిటంటే విజ‌య్ న‌టించిన చాలా చిత్రాల‌లో ముస్లింల‌ను ఉగ్ర‌వాదులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు.

ప్ర‌త్యేకించి ద‌ళ‌ప‌తి విజ‌య్ ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, త‌ను ముస్లింల‌ను త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నాడ‌ని, మ‌న మేలు కోసం కాద‌న్నారు. మ‌త ప‌రంగా జ‌రిగే స‌మావేశాల‌కు, కార్య‌క్ర‌మాల‌కు న‌టుడిని పిల‌వ‌వ‌ద్దంటూ కోరాడు. ముస్లింల సెంటిమెంట్ ను వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని , దీనిని గ‌మ‌నించాల‌ని సూచించాడు ముస్లిం స‌మాజానికి. దీనిపై విజ‌య్ అభిమానులు సీరియ‌స్ గా స్పందించారు. కావాల‌ని కొన్ని పార్టీలు టీవీకే పై బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు.

Also Read : Hero Sunny Deol-Jaat :జాట్ బిగ్ స‌క్సెస్ సీక్వెల్ అనౌన్స్

Thalapathy VijayUpdatesViral
Comments (0)
Add Comment