Rajinikanth : అగ్రనటుడు ‘రజనీకాంత్’ ఇంట్లో వరద బీభత్సం

మంగళవారం నుండి చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో. రవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అయ్యింది...

Rajinikanth : గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నై‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. చెన్నైలో 19 సెం.మీల భారీ వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బాధితుల కోసం 931 పునరావాసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో 16 వేల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 వేలమంది ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలకు కూడా కష్టాలు తప్పడం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఈ లిస్ట్‌లో చేరారు.

Rajinikanth House…

మంగళవారం నుండి చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో. రవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అయ్యింది. ఈ క్రమంలోనే తాత్కాలికంగా మెట్రో‌ని నిలిపివేశారు. చెన్నై నుండి బయలుదేరే విమానాలను క్యాన్సిల్ చేశారు. రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరడంతో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఫ్లైఓవర్‌లపైనే కార్లు పార్క్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోస్ గార్డెన్ దగ్గర్లోని రజినీకాంత్ ఇంటికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. రజినీ ఇంటి ఆవరణలో వరద నీరు చేరినట్లు తెలుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు,చెంగల్పట్టు జిల్లాల్లో వర్షాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల రిలీజైన తలైవా సినిమా వేట్ట‌య‌న్ విషయానికొస్తే.. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో మాస్‌, మూమెంట్స్‌, కమర్షియాలిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి చిత్రాలు అరుదు. దర్శకుడు రచన మీద కూడా దృష్టి పెడితే ఆ తరహా చిత్రాలు వస్తాయనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. రజినీ సన్నివేశాలు, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. దానికి తోడు తలైవా అభిమానులు కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. విద్యావ్యవస్థ గురించి ఇచ్చిన సందేశం అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది.

Also Read : Salman Khan : సల్మాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ ఆలా చేయాలంటూ వార్నింగ్

BreakingrajinikanthUpdatesViral
Comments (0)
Add Comment