Dancer Janu : ఎట్టకేలకు తన మనసులో మాట బయట పెట్టింది ఫోక్ డ్యాన్సర్ జాను లిరి. తనకు ఇదివరకే పెళ్లి అయ్యింది. ఓ బాబు కూడా ఉన్నాడు. ఇదే సమయంలో తన గురించి పెద్డ ఎత్తున ట్రోల్స్ రావడంతో గత్యంతరం లేక తను తట్టుకోలేక ఇక సూసైడ్ చేసుకుంటానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసింది. దీంతో సూసైడ్ చేసుకుంటుందేమోనని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు ఈ అమ్మడు బయటకు వచ్చేసింది.
Dancer Janu Marriage Updates Viral
త్వరలోనే తీపి కబురు చెబుతానని, తాను ఆత్మహత్య చేసుకునే పిరికిదానిని కాదంటూ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తనను మన్నించాలని కోరింది. కొంత సమయం ఇస్తే తాను అధికారికంగానే పెళ్లి చేసుకునే విషయాన్ని బహిరంగంగా తెలియ చేస్తానంటూ ప్రకటించింది. తను అన్నట్టుగానే కీలక సమాచంర వెల్లడించింది. ఇదే సమయంలో అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది డ్యాన్సర్ జాను లిరి(Dancer Janu). తెలంగాణ జానపద గీతాలలో తళుక్కున మెరిసింది.
ఉన్నట్టుండి తాను ప్రముఖ సింగర్ దిలీప్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇద్దరూ కలిసి అన్యోన్యంగా దిగిన ఫోటోను షేర్ చేసింది . ఇద్దరూ కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. గాయకుడిగా తనను ఆదరించారని, డ్యాన్సర్ గా జానును ప్రేమించారని, మా ఇద్దరినీ మీరంతా ఆశీర్వదించాలని కోరాడు సింగర్. తమను ట్రోల్ చేయడం మానుకోవాలని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నామంటూ తెలిపాడు. కామెంట్స్ , ట్రోల్ చేయడం ఆపాలని మన్నించి దీవించాలని కోరారు.
Also Read : Hero Jr NTR :జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్