యుద్దం ఎందుకు ఆప‌రేశారో మోదీ చెప్పాలి

నిప్పులు చెరిగిన కేంద్ర మాజీ మంత్రి ఫైర్

గుంటూరు జిల్లా – యుద్ధం మొదలైంది. మధ్యలో ఆగిపోయింది. ఎందుకు మొదలుపెట్టారో ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్. యుద్ధం మొదలైనప్పుడు అందరం ఊహించామ‌ని, 1971లో ఇందిరా గాంధీ చేసినట్లు జరుగుతుందని, లేదా 1999 లో వాజ్ పేయ్ కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతుందని భావించామన్నారు. భారత సైనికులకు తలవంచి, వినయంగా నమస్కారాలు తెలియ జేస్తున్నానని అన్నారు.

అమెరికా జోక్యం బాగా కనిపిస్తోందన్నారు. గుంటూరులో చింతా మోహ‌న్ మీడియాతో మాట్లాడారు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని అన్నారు. ట్రంప్ కి, భారతదేశానికి ఏంటి రహస్య ఒప్పందం అంటూ ప్ర‌శ్నించారు. భారత ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచి, చర్చించి ఉంటే బాగుండేదన్నారు. భారతదేశ ఔన్నత్వానికి, సార్వభౌమాధికారానికి మచ్చ తెచ్చింది బిజెపి అని ఆరోపించారు.

ప్రతిపక్షాలును పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇందిరా గాంధీ, వాజపేయి హయాంలో ప్రతిపక్షాలను సంప్రదించే ఆచారం ఉండేద‌న్నారు. కానీ మోదీ వ‌చ్చాక దానికి మంగ‌ళం పాడార‌ని అన్నారు. బిజెపి పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జ‌రుగుతోంద‌న్నారు. బిజెపి గుండాలు ఆదివాసి పురుషుల పురుషాంగాలను, మహిళల రొమ్ములను కోస్తున్నారని వాపోయారు. చిన్న బిడ్డలను కూడా చంపుతున్నారని, సనాతన ధర్మం అంటే ఇదా అని నిల‌దీశారు చింతా మోహన్.

Comments (0)
Add Comment