Game Changer Update : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్

ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి...

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారనే దానికి ఉదాహరణ.. ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చేస్తున్న డ్యూటీనే. అవును.. ఒక ఫ్యాన్ చేసిన ఈ పోస్టర్.. చివరికి చిత్రయూనిట్‌ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. నిజమే అనుకుని.. ఆ టీమ్ మెంబర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ఎవరా టీమ్ మెంబర్, ఏమా కథ అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. పూర్తి వార్త చదివేయండి మరి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్(Game Changer)’.

ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్‌ని, నిర్మాణ సంస్థ ఎస్‌విసి బ్యానర్‌ని ట్యాగ్ చేస్తూ తిట్టిపోస్తున్న సమయంలో.. ఇంక లాభం లేదనుకుని మేకర్స్ వినాయకచవితికి ఓ పోస్టర్ వదిలి.. ఫ్యాన్స్‌ని కాస్త శాంతింపజేశారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్‌ కోసం అభిమానులు డ్యూటీ చేయడం స్టార్ట్ చేశారు.

Game Changer Updates

తాజాగా ఫ్యాన్స్.. ‘గేమ్ చేంజర్(Game Changer)’ రిలీజ్ డేట్‌తో ఓ పోస్టర్‌ని రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పోస్టర్ ఎలా ఉందంటే.. నిజంగానే మేకర్స్ విడుదల చేశారేమో అనేలా ఉంది. డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ‘గేమ్ చేంజర్’ విడుదల అంటూ వచ్చిన ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ చూసి.. ఆ సినిమాకు పని చేస్తున్న డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా కూడా నిజమే అనుకున్నారు. ఆయన కూడా ఆ పోస్టర్‌ని తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసి.. ‘డిసెంబర్ 20.. కొత్త ఆట మొదలవుతుంది’ అని తెలపడంతో.. ఫ్యాన్స్ అంతా నిజమే అనుకుని.. ఆయన పోస్ట్‌ని లైక్స్‌తో, రీ ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ పోస్టర్‌ని తీక్షణంగా చూస్తే కానీ.. అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనేది తెలియడం లేదు. మరి ఈ స్పందనను చూసైనా.. చిత్రయూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూద్దాం.

Also Read : Shraddha Srinath : ఈ మధ్య తెగ వైరల్ అవుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన శ్రద్ధ

Cinemagame changerTrendingUpdatesViral
Comments (0)
Add Comment