Game Changer : గేమ్ ఛేంజర్ ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ లో చరణ్ డాన్స్ పై ప్రశంసలు

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది...

Game Changer : గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌(Game Changer)’ నుంచి ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సెకెండ్‌ సింగిల్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాటలో రామ్‌చరణ్‌ డ్యాన్స్‌పై ఉపాసన, సమంతలు ప్రశంసలు కురిపించారు. ‘రా మచ్చా మచ్చా.. పాటను రామ్‌చరణ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసి ‘ఈ పాటను నేను ఆనందించినట్లు.. మీరూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నా’ అని రాశారు. ఈ పోస్ట్‌పై ఉపాసన స్పందిస్తూ.. మిస్టర్‌ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్‌ పుట్టించారని రిప్లై ఇచ్చారు. దీనిపై సమంత కూడా స్పందించారు. ‘ నిన్నెవరూ మ్యాచ్‌ చేయలేరు అంటూ.. ‘అన్‌మ్యాచ్‌బుల్‌’ అని పేర్కొన్నారు. దానికింద ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్‌ చేయగలరు’’ అని సామ్‌ రాసుకొచ్చారు. రామ్‌ చరణ్‌ ప్రతి పోస్ట్‌కు సమంత స్పందిస్తుంటారు. వీరిద్దరూ కలిసి సూపర్‌హిట్‌ చిత్రం రంగస్థలంలో నటించారు.

Game Changer Song…

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ‘రా మచ్చా మచ్చా’ పాటను ఓ కాలేజ్‌లో విడుదల చేశారు. ఈ పాటకి తమన్‌ స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. నకాశ్‌ అజీజ్‌ ఆలపించారు. ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా పాన్‌ ఇండియా స్థారులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కియారా అద్వానీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, జయరామ్‌, నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Hero Varun Tej : వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ చిత్రం నుంచి ఓ సరికొత్త లుక్

Cinemagame changerTrendingUpdatesViral
Comments (0)
Add Comment