Hero Ajith Kumar :అజిత్ వ్య‌వ‌హారం వాసుదేవ మీన‌న్ ఆగ్ర‌హం

కార్ రేస్ పై అమితాస‌క్తి సినిమాల‌కు ఆటంకం

Ajith Kumar : త‌మిళ‌నాడు స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ న‌టుడు అజిత్ కుమార్ పై. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి కోలీవుడ్ ను. ఇక ద‌ర్శ‌కుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క్రియేటివిటీకి పెద్ద‌పీట వేస్తాడు. త‌న‌తో న‌టించిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు ఎంతో ప‌రిణ‌తి చెందిన వారిగా ఇప్ప‌టికే పేరు పొందారు. త‌ను ఈ మ‌ధ్య సినిమాలు తీసేందుకు కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇదే స‌మ‌యంలో న‌టుడిగా డైరెక్ట‌ర్ కొత్త అవ‌తారం ఎత్తాడు.

Gautam Menon – Ajith Kumar

ఈ స‌మ‌యంలో చిట్ చాట్ సంద‌ర్బంగా తాను స్టార్ హీరోల‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌నే దానిపై మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు. అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్. అత‌ను అక‌స్మాత్తుగా రేసులో పాల్గొనేందుకు వెళ్లాడు. నేనేమో ప్రాజెక్టుకు సంబంధించి షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్నా. ఈ స‌మ‌యంలో అలా వదిలేసి వెళ్లిపోతే ఏం చేయాలంటూ ప్రశ్నించాడు.
త‌న తీరుతో తాను చాలా ఇబ్బంది ప‌డ్డానంటూ పేర్కొన్నాడు.

భార‌తీయ సినిమా సూప‌ర్ స్టార్ల తీరంతా ఒక్కొక్క‌రిదీ ఒక్కోలాగా ఉంటుంద‌న్నాడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్. చిత్ర నిర్మాత‌లు, ఇత‌ర న‌టీనటులు కూడా వీరి డేట్స్ మీద ఆధార‌ప‌డి సినిమా స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి వ‌స్తుంద‌ని చెప్పాడు. అజిత్, త‌న‌కు మ‌ధ్య అలాంటి వివాదం చోటు చేసుకుంద‌న్నాడు. త‌న సినీ కెరీర్ లో 50వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి వ‌చ్చిన త‌ర్వాత ఇదంతా ప్రారంభ‌మైంద‌న్నాడు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్. త‌ను నా నుంచి కాకుండా వెంక‌ట్ ప్ర‌భుతో క‌లిస ప‌ని చేయాల‌ని నిర్ణ‌యం త‌న‌ను ఎంత‌గానో బాధ‌కు గురి చేసింద‌న్నాడు. త‌న కోసం ఏడాది వేచి ఉండ‌మ‌న్నాడని తెలిపాడు.

Also Read : Hero Suriya Retro Movie :క‌లెక్ష‌న్ల వేట‌లో సూర్య రెట్రో

Ajith KumarCommentsgowtham menonViral
Comments (0)
Add Comment