వ‌న్డే ఫార్మాట్ కు గ్లెన్ మ్యాక్స్ వెల్ గుడ్ బై

ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇంట‌ర్నేష‌న‌ల్ ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ మేర‌కు వ‌న్డే ఫార్మాట్ నుంచి తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌న‌ను అభిమానించే వేలాది మంది ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. త‌ను గ‌త కొంత కాలం నుంచి గాయాల బారిన ప‌డుతూ వ‌స్తున్నాడు. దీంతో ఐపీఎల్ లో కొన‌సాగుతాన‌ని తీపి క‌బురు చెప్పాడు. కానీ వ‌న్డేల‌లో ఆడబోనంటూ పేర్కొన్నాడు.

వ‌చ్చే ఏడాది ఇండియా, శ్రీ‌లంక లో జ‌ర‌గ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొంటాన‌ని చెప్పాడు. త‌న‌తో జ‌రిపిన పాడ్ కాస్ట్ లో ఈ విష‌యం వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం నా ఆరోగ్య ప‌రంగా దృష్ట్యా 2027లో జ‌రిగే వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాను ఆడుతాన‌ని అనుకోలేద‌న్నాడు. ఈ విష‌యం గురించి తాను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కు సెలెక్ష‌న్ క‌మిటీకి చెప్పాన‌ని తెలిపాడు. త‌న స్థానంలో వేరొక‌రికి ఛాన్స్ ఇవ్వాల‌ని సూచించిన‌ట్లు తెలిపాడు గ్లెన్ మ్యాక్స్ వెల్.

ఇదిలా ఉండ‌గా ఈ స్టార్ క్రికెట‌ర్ ఫాస్ట్ హిట్ట‌ర్ గా పేరు పొందాడు. అల‌వోక‌గా ఫోర్లు, సిక్స‌ర్లు కొట్ట‌డంలో త‌ను సూప‌ర్. త‌న వ‌య‌సు 36 ఏళ్లు. 149 వ‌న్డేలు ఆడాడు. 33.81 స‌గ‌టుతో 3,990 ర‌న్స్ చేశాడు. త‌న కెరీర్ లో మ‌రిచి పోలేని మ్యాచ్ ఏదైనా ఉందంటే అది 2023లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆఫ్గ‌నిస్తాన్ మ్యాచ్ సంద‌ర్బంగా ఆసిస్ 7 వికెట్లు కోల్పోయి 91 ర‌న్స్ చేసింది. ఆ స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన మ్యాక్స్ వెల్ 201 ర‌న్స్ చేశాడు. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు.

Comments (0)
Add Comment