Hero Ajith- Good Bad Ugly OTT :మే 8న ఓటీటీలో గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్

ఇప్ప‌టికే రూ. 250 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు

Good Bad Ugly : అజిత్ కుమార్, త్రిష కృష్ణ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ విడుద‌లైంది. మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్, రొమాంటిక్ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. సినీ వ‌ర్గాలు విస్తు పోయేలా ఏకంగా రూ. 250 కోట్లు వ‌సూలు చేసింది. ఇదే ఏడాదిలో అజిత్, త్రిష కాంబినేష‌న్ లో వ‌చ్చింది విదాముయార్చి ఆశించిన మేర ఆడ‌లేదు. అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక ఏ మూవీ అయినా ఓటీటీలోకి రావాలంటే దాదాపు రెండు నెల‌లు ఆగాల్సి ఉంటుంది. అంత వ‌ర‌కు స్ట్రీమింగ్ చేసేందుకు వీలుండ‌దు.

Hero Ajith Kumar Good Bad Ugly OTT Updates

ప్రస్తుతం మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా పెట్టిన డ‌బ్బులు తిరిగి రావ‌డం, ఆదాయం స‌మ‌కూరడంతో అజిత్ కుమార్, త్రిష కృష్ణ‌న్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే మూవీ అభిమానులు మాత్రం ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందా అని ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. వీరికి తీపి క‌బురు చెప్పారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) చిత్రానికి ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దీనిని త‌మిళ యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించాడు. ఏప్రిల్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని.

ఈ సినిమాకు సంబంధించి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. కొంద‌రు దీనిని ప‌రిపూర్ణ‌మైన బిగ్ స్క్రీన్ ఎంట‌ర్ టైన‌ర్ అంటూ పేర్కొన్నారు. మ‌రికొంద‌రు అజిత్ , త్రిష అభిమానుల కోసం మాత్ర‌మేనంటూ స్ప‌ష్టం చేశారు. మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా ఊహించ‌ని రీతిలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించింది. అజిత్ కుమార్ సినీ కెరీర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బిగ్ క‌లె క్ష‌న్స్ సాధించిన మూవీగా నిలిచి పోయింది. ఇక ఓటీటీలోకి మే 8న స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం. కాగా ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు సద‌రు సంస్థ‌.

Also Read : Arjun Son of Vyjayanthi Success :సినిమా స‌క్సెస్ రాములమ్మ ఖుష్‌

Ajith KumarCinemaGood Bad UglyOTTUpdatesViral
Comments (0)
Add Comment