Goodachari 2: వచ్చే ఏడాది అడవి శేష్‌ ‘జీ2’ !

వచ్చే ఏడాది అడవి శేష్‌ ‘జీ2’ !

Goodachari 2: ‘మేజర్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో అడివి శేష్‌. ప్రస్తుతం అడవి శేష్… 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన గుఢాచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘జీ 2’ (గుఢాఛారి 2(Goodachari 2)) సినిమాలో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకె ఎంటర్టైన్ మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అడవి శేష్ కథను అందిస్తున్నారు. స్పై, యాక్షన్, థ్రిల్లర్ గా ఐదు దేశాల్లో షూటింగ్ చేసుకోబోయే ఈ సినిమాలో అడవి శేష్ సరసన బనితా సంధు నటిస్తున్నారు. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది.

Goodachari 2 Movie Updates

‘గూఢచారి’ కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా… ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘గూఢచారి’ విడుదలైన ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జీ2’ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్‌ను అడవి శేష్‌ పంచుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Also Read : Hero Akhil : హీరో అఖిల్ అక్కినేనితో నిహారిక షార్ట్ ఫిల్మ్ చేసిందా..?

adivi seshGoodachari 2
Comments (0)
Add Comment