Kingston Sensational :జీవీ ప్ర‌కాష్ ‘కింగ్‌స్టన్‌’ సెన్సేష‌న్

మార్చి 7న త‌మిళ్..తెలుగులో రిలీజ్

Kingston : జీవీ ప్ర‌కాశ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో త‌ను ఒక‌డు. ఓ వైపు అనిరుధ్ రవిచంద‌ర్ దుమ్ము రేపుతుంటే మ‌రో వైపు జీవీ త‌న‌దైన స్టైల్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌ను సంగీత ద‌ర్శ‌కుడే కాదు మంచి న‌టుడు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కు 100 సినిమాలు పూర్తి చేశాడు మ్యూజిక్ ప‌రంగా. ఇక న‌టుడిగా తాజాగా కింగ్ స్ట‌న్(Kingston) తో మ‌న ముందుకు రాబోతున్నాడు. ఇది త‌న సినీ కెరీర్ ప‌రంగా న‌టుడిగా 25వ చిత్రం కావ‌డం విశేషం.

Kingston Movie Sensational

కెరీర్ లో టాప్ లోకి రావాలంటే క‌ష్ట ప‌డాల్సిందేనంటాడు. తాను ర‌క్తం కారుతున్నా లెక్క చేయ‌కుండా కింగ్ స్ట‌న్ మూవీలో న‌టించాన‌ని ఈ సంద‌ర్బంగా చెప్పాడు. ప్ర‌స్తుతం తెలుగులో నితిన్ రెడ్డి, ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల‌తో క‌లిసి చేస్తున్న రాబిన్ హుడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు జీవి ప్ర‌కాశ్.

ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు అత్యంత జ‌నాద‌ర‌ణ పొందాయి. చార్ట్స్ లో టాప్ లో కొన‌సాగుతున్నాయి. ప్ర‌త్యేకించి శ్రీ‌లీల చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఇక కింగ్ స్టన్ సినిమా త‌న జీవితంలో మ‌రిచి పోలేని సినిమాగా నిలిచి పోతుంద‌ని పేర్కొన్నాడు జీవీ ప్ర‌కాశ్. మ‌న‌సు పెట్టి చేశాన‌ని, ప‌క్కా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నాడు.

Also Read : Telugu Dynamic Directors :డైన‌మిక్ డైరెక్ట‌ర్స్ నెట్టింట్లో వైర‌ల్

CinemaGV PrakashKingstonTrendingUpdates
Comments (0)
Add Comment