Habibi Jilebi Song : హ‌బీబీ జిలేబీ సాంగ్ రిలీజ్

బొబ్బుల్ గ‌మ్ మూవీ

Habibi Jilebi Song : బొబ్బుల్ గ‌మ్ మూవీకి సంబంధించి తాజాగా మూవీ మేక‌ర్స్ హబీబీ జిలేబీ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువ‌త‌కు కిక్కు ఎక్కించేలా ఉంది ఈ పాట‌. దీనిని గేయ ర‌చ‌యిత కాస‌ర్ల శ్యామ్ రాశారు. రోష‌న్ క‌న‌కాల‌, మానస చౌద‌రి, హ‌ర్ష చెముడు, కిర‌ణ్ మ‌చ్చ‌, అన‌న్య ఆకుల , హ‌ర్ష వ‌ర్ద‌న్ , అను హాస‌న్ , చైతు జొన్న‌ల‌గ‌డ్డ‌, బిందు చంద్ర‌మౌళి న‌టించారు.

Habibi Jilebi Song Wiil be Release

హ‌బీబీ జిలేబీ పాట‌కు సంగీతం అందించారు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌. పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. విజ‌య్ పోలాకి కొరియోగ్ర‌ఫీ అందించ‌గా పాట‌ను హైద‌రాబాద్(Hyderabad) లోని సౌండ్ డాక్ లో రికార్డింగ్ చేశారు. బ‌బ్బుల్ గ‌మ్ మూవీకి సంబంధించి క‌థ‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు పేరేపు ర‌వికాంత్.

విష్ణు కొండూరు, సెరి గ‌న్నీ క‌థా స‌హ‌కారం అందించారు. మ‌హేశ్వ‌రి మూవీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై బొబ్బుల్ గ‌మ్ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఇదే సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ల ముద్దు సీన్ క‌ల‌క‌లం రేపింది. ఇవాళ రిలీజ్ అయ్యే ప్ర‌తి మూవీలో ఏదో ఒక ర‌కంగా కిస్ ఉండేలా చూస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు.

ఇవే త‌మ‌కు క‌నక వ‌ర్షం కురిపించేలా చేస్తాయ‌ని న‌మ్ముతున్నారు. వారు తీస్తున్నారు మేం చూస్తున్నామంటున్నారు ఫ్యాన్స్.

Also Read : Salar Movie : సలార్ ఫైట్ సీక్వెల్ కోసం 750 వాహనాలు

Comments (0)
Add Comment