టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. మార్కో మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు హరీఫ్ అదేనీ. ఈ మూవీలో రక్తాన్ని ఏరులై పారించాడు. ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను కన్వీన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇది పక్కన పెడితే మనోడు ఓ యాడ్ తీశాడు. ఇందులో నటించింది ఎవరో కాదు 64 ఏళ్ల నందమూరి బాలకృష్ణ. ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. యాడ్ తీసే సమయంలోనే తనకు నచ్చిన కథను బాలయ్యకు వినిపించాడట. ఇందుకు తక్షణమే ఓకే చెప్పాడని టాక్. ఈ సినిమా తీసేందుకు రెడీ అని ఇప్పటికే చెప్పేశాడు దిల్ రాజు. ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
ప్రస్తుతం నందమూరి బాలయ్య అఖండ-2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన కెరీర్ లో 111వ చిత్రం గోపిచంద్ మలినేనితో తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఆ తర్వాత హనీఫ్ అదేనీతో మూవీ ఉంటుందని టాక్. ఇది పక్కన పెడితే అన్ని రసాలను తెరపై అద్భుతంగా పండించడంలో తనకు తనే సాటి నందమూరి బాలయ్య. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్బంగా అఖండ 2 టీజర్ ను రిలీజ్ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇది యూట్యూబ్ ను, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక దమ్మున్న నటుడు బాలయ్య, డైనమిక్ డైరెక్టర్ హనీఫ్, సూపర్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఇక మామూలుగా ఉండదంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఏది ఏమైనా వయసు పెరుగుతున్నా ఎక్కడా తగ్గడం లేదు నందమూరి నట సింహం. పౌరుషానికి ప్రతీక నా నటన అంటూ ప్రకటించాడు. మొత్తంగా ఈ మూవీకి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దిల్ రాజు.