Hero Ajith Kumar : అజిత్ న‌మ్మ‌క ద్రోహం హీరా ఆగ్ర‌హం

త‌మిళ న‌టుడిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Ajith Kumar : త‌మిళ సినీ న‌టుడు అజిత్ కుమార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది ప్ర‌ముఖ న‌టి హీరా. త‌ను అనుకున్నంత మంచోడు కాద‌ని పేర్కొంది. త‌న‌ను ప్రేమించానంటూ న‌మ్మించాడ‌ని, ఆ త‌ర్వాత మోసం చేశాడంటూ వాపోయింది. ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఎవ‌రికి వారు వేర్వేరుగా జీవిస్తున్నారు. కానీ హీరా గ‌తంలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 1990 ద‌శ‌కంలో ప్ర‌ముఖ న‌టీమ‌ణుల్లో త‌ను కూడా ఒక‌రు. అప్ప‌ట్లో అజిత్(Ajith Kumar) , హీరా(Heera Rajagopal) కాంబినేష‌న్ ఉండేది. ప్రేక్ష‌కులు కూడా వీరిద్ద‌రిని ఆద‌రించారు. పెళ్లి కూడా చేసుకుంటార‌ని అంతా భావించారు.

Ajith Kumar Shocking

కానీ ఉన్న‌ట్టుండి మ‌ణిర‌త్నం మూవీలో త‌ళుక్కున మెరిసిన హీరోయిన్ షాలిని ప్రేమ‌కు లొంగి పోయాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇంత‌లో బాంబు పేల్చింది అందాల ముద్దుగుమ్మ హీరా. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొడ‌రుల్ , కాద‌ల్ కోటై అనే చిత్రాల‌లో న‌టించారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉండేద‌ని అప్ప‌ట్లో మీడియా కోడై కూసింది. అయితే త‌న‌కు త‌మిళంలో మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసిన చిత్రం ఇద‌యం. అది బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో త‌ను కోలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. తెలుగులో కూడా హీరా న‌టించింది.

కానీ ఎక్కువ త‌మిళ తంబిలే త‌న‌ను ఆద‌రించారు. అక్కున చేర్చుకున్నారు. ఇద్ద‌రూ పీక‌ల లోతుల్లోకి వెళ్లి పోయారు. కానీ హీరాకు షాక్ ఇస్తూ షాలినిని పెళ్లి చేసుకున్నాడు అజిత్ కుమార్. దీనిని త‌ట్టుకోలేక హీరా త‌ను కూడా మ‌రొక‌రిని వివాహం చేసుకుని దేశం విడిచి వెళ్లి పోయింది. కానీ కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత త‌ను నోరు విప్పింది. అజిత్ మంచోడు కాద‌ని, త‌న‌ను పూర్తిగా ముంచేశాడ‌ని, త‌న వ్య‌క్తిత్వాన్ని కించ ప‌రిచేలా చేశాడ‌నంటూ వాపోయింది. త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాకుండా ఉండేందుకు మీడియాను కూడా మేనేజ్ చేశాడంటూ ఆరోపించింది. తాజ‌గా హీరో చేసిన కామెంట్స్ కోలీవుడ్ లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ఇంకా స్పందించ లేదు అజిత్ కుమార్.

Also Read : Hero Vijay Deverakonda :రౌడీ కింగ్ డ‌మ్ ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రెడీ

Ajith KumarHeera RajagopalPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment