Hema: సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్‌మెంట్‌ అడుగుతున్న హేమ !

సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్‌మెంట్‌ అడుగుతున్న హేమ !

Hema: కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్న ఆరోపణలతో నటి హేమ(Hema) అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్‌ పై బయటకు వచ్చారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తాను డ్రగ్స్‌ తీసుకోలేదు అని ఆ వీడియో ద్వారా మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి తాను టెస్ట్‌లు చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ‘‘కొన్ని నెలలుగా నాపై మీడియాలో చాలా రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. దాని వల్ల 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే.

Hema…

నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా జుట్టు, గోళ్లు, బ్లడ్‌ అన్నీ ఇచ్చి టెస్ట్‌ చేయించుకున్నాను. ఇందులో నాకు నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇదే విషయాన్ని నేను ఛానల్స్‌ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ, అని మీ ముందు చెప్పడానికి వచ్చాను. అలాగే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అపాయింట్‌ మెంట్‌ అడగటానికి ఈ వీడియో చేశాను. ఈ వీడియో వారికి చేరుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు. అలానే తాను చేయించుకున్న డ్రగ్‌ టెస్ట్‌ రిపోర్ట్స్‌ని ఆమె వీడియోలో షేర్‌ చేసింది.

Also Read : IC 814 The Kandahar Hijack: థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ గా ఓటీటీలోనికి ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌’ !

AP Deputy CM Pawan KalyanBangalore Rave PartyBanglore PoliceCM Revanth ReddyHema
Comments (0)
Add Comment