Hero Nani : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన హీరో నాని

ఈ కామెంట్స్‌పై రానా స్పందిస్తూ.. పవన్‌ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు...

Hero Nani : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై నటుడు నాని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌కు మద్దతుగా నిలిచిన హీరోల్లో నాని(Hero Nani) ఒకరు. ఆయనకు మద్దతుగా పోస్ట్‌ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా పవన్‌ గురించి రానా దగ్గుబాటి షోలో మాట్లాడారు. పవన్‌ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్‌ స్టారే అని అన్నారు. ‘సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ స్టార్‌గా ఎలా ఎదిగారో తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌స్టార్‌ అని నిరూపించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు’ అని నాని అన్నారు.

Hero Nani Comment

ఈ కామెంట్స్‌పై రానా స్పందిస్తూ.. పవన్‌ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన నిజంగానే సూపర్‌స్టార్‌ అని రానా అన్నారు. రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నానితోపాటు ప్రియాంక అరుల్‌ మోహన్‌ కూడా పాల్గొన్నారు. రానా ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఈ షో తొలి ఎపిసోడ్‌ను గోవాలో జరుగుతోన్న 55వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో ఓ టాక్‌ షో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : King Nagarjuna : ఏయన్నార్ బయోపిక్ వార్తలపై స్పందించిన నాగార్జున

CommentsHero Nanipawan kalyanViral
Comments (0)
Add Comment