Hero Nani Shocking Comment :విమ‌ర్శ‌లు పట్టించుకోను ప్ర‌మోష‌న్స్ ఆపను

న‌టుడు..నిర్మాత నేచుర‌ల్ స్టార్ నాని కామెంట్

Nani : నేచుర‌ల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌ను న‌టించిన హిట్3 మూవీ షూటింగ్ పూర్త‌యింది. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ తేదీని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న నేచుర‌ల్ స్టార్(Nani) మూవీ ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్ పెట్టాడు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన చిట్ చాట్ లో అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. తాను విమ‌ర్శ‌ల‌ను, ఆరోప‌ణ‌ల‌ను పట్టించుకోనంటూ స్ప‌ష్టం చేశాడు. అలా ప‌ట్టించు కోవ‌డం మొద‌లు పెడితే సినిమా పూర్తి కాద‌న్నాడు. త‌న దృష్టి అంతా సినిమా, న‌ట‌న‌, ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేస్తున్నానా లేదా అని చూస్తాన‌ని చెప్పాడు.

Nani Shocking Comments

విమ‌ర్శ‌ల గురించి తాను ఆలోచించ‌న‌ని, ప్ర‌మోష‌న్స్ కు సంబంధించి ప్ర‌చారం ఆపే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశాడు. తాను సినిమా చేస్తున్న‌ప్పుడే క‌థ బాగుండాల‌ని అనుకుంటాన‌ని, కంటెంట్ ఈ జ్ కింగ్ అని తాను న‌మ్ముతాన‌ని చెప్పాడు. ఇందులో ఎలాంటి వెనుకంజ వేసే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు నాని. సినిమా సమీక్ష‌లు, విమ‌ర్శ‌లకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్ప‌టికే హిట్ 3 మూవీకి చెందిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. అంచ‌నాలు పెంచేలా చేసింది ప్ర‌త్యేకించి టీజ‌ర్.

త‌ను గ‌తంలో తీసిన సైంధ‌వ్ ఆశించిన మేర ఆడ‌లేదు. ఎలాగైనా స‌రే హిట్ 3ని హిట్ చేయాల‌న్న క‌సితో దీనిని తీశాడు. అదే తెర‌పై క‌నిపించింది. అయితే గ‌తంలో కంటే భిన్నంగా ఈసారి నాని రంగంలోకి దిగాడు. ముంబై లాంటి మ‌హాన‌గ‌రంలో మూవీ ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టాడు. హిందీలో కూడా త‌న మార్క్ ను చూపించాల‌ని డిసైడ్ అయ్యాడు. ఇందులో నేచుర‌ల్ స్టార్ తో పాటు శ్రీ‌నిధి శెట్టి కీ రోల్ పోషించింది. కాగా తాజా స‌మాచారం మేర‌కు మ‌ల్టీ ప్లెక్స్ ల‌లో కాకుండా సింగిల్ స్క్రీన్ ల‌లో మాత్ర‌మే రిలీజ్ చేయాల‌ని నాని ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్.

Also Read : Hero Ram Pothineni-Borse :రామ్ పోతినేనితో బోర్సే డేటింగ్ నిజ‌మేనా..?

CommentsHero NaniShockingViral
Comments (0)
Add Comment