Hero Raviteja: ‘మిస్టర్ బచ్చన్’ గా మాస్ మహారాజ్

'మిస్టర్ బచ్చన్' గా మాస్ మహారాజ్

Hero Raviteja: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి జతకట్టారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ను ఖరారు చేసారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యుడిగా ఉన్న హరీష్ శంకర్ కు… ‘షాక్’ సినిమాతో రవితేజ(Hero Raviteja) అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాకు ఆశించినంత విజయం లభించనప్పటికీ… ఆ తరువాత ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్‌కు మరో అవకాశం ఇచ్చారు. ‘మిరపకాయ్’ సినిమాతో రవితేజకు మంచి కమర్షియల్‌గా హిట్ ఇవ్వడంతో పాటు మాస్ మహారాజా అనే ట్యాగ్ ను కూడా ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ‘మిరపకాయ్’ వచ్చిన సరిగ్గా 12 ఏళ్ల తర్వాత… ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ ను కూడా ఖరారు చేసారు.

Hero Raviteja – ‘రైడ్‌’కి రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్’ ?

తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్‌లో చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ దిట్ట. రవితేజతో హరీష్ చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నారు కాబట్టి ‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అంటూ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. హిందీలో విజయవంతమైన ‘రైడ్‌’కి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్… ఈ సినిమా కోసం రవితేజతో ప్రత్యేకంగా ఫొటోషూట్‌ నిర్వహించినట్లు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ నుండి వచ్చే సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ఆశించినంత విజయం ఇవ్వనప్పటికీ… ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగిల్’ అనే సినిమాలో రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో బిజీగా ఉన్నారు.

Also Read : M M Kiravani: కీరవాణితో మురళీమోహన్ వియ్యం

Harish Sankarravi teja
Comments (0)
Add Comment