Hero Vijay Movie : ‘ద‌ళ‌ప‌తి 69’ టైటిల్..ఫ‌స్ట్ లుక్ రిలీజ్

విజ‌య్ చివ‌రి చిత్రం ఇదే

Hero Vijay : త‌మిళ సినీ టాప్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్(Hero Vijay) త‌న కెరీర్ లో చివ‌రి సినిమా ద‌ళ‌ప‌తి 69 . ఈ మూవీకి సంబంధించి మూవీ మేక‌ర్స్ టైటిల్ ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న స్టార్ డ‌మ్ క‌లిగిన విజ‌య్ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ బ‌డ్జెట్ దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు.

Hero Vijay ‘Thalapathy69’ Movie Updates

త‌ను త్రిష కృష్ణ‌న్ తో క‌లిసి గోట్ మూవీలో న‌టించాడు. ఇది బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ద‌ళ‌ప‌తికి ఇదే ఆఖ‌రి చిత్రంగా అందరూ భావించారు. కానీ ఊహించ‌ని రీతిలో కొత్త మూవీ ప్ర‌క‌టించాడు. ఇది పూర్తిగా రాజ‌కీయ‌, సందేశాత్మ‌క చిత్రంగా ఉండ బోతోంద‌ని స‌మాచారం.

ఇందుకు త‌గ్గట్టుగానే త‌న పోస్ట‌ర్ ను డిజైన్ చేశారు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పైనే ఎక్కువ‌గా ఇందులో ప్ర‌స్తావించిన‌ట్లు టాక్. గ‌తంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కార్ మూవీలో న‌టించాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ప్ర‌ధానంగా ఓటు విలువ ఏమిటో చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. రాజ‌కీయ నాయ‌కుల‌కు, అధికారుల‌కు, బ్యూరోక్ర‌సీ ఎలా ఉండాలో చెప్పాడు. ఇది ఊహించని స్థాయిలో స‌క్సెస్ అందుకుంది. ఆ రేంజ్ లో ప్ర‌స్తుతం విడుద‌ల కాబోయే ద‌ళ‌ప‌తి 69లో ఉండబోతోంద‌ని స‌మాచారం.

Also Read : Arjit Singh – Special Award : స్వ‌ర మాంత్రికుడు అర్జిత్ సింగ్

CinemaHero VijayThalapathy 69TrendingUpdates
Comments (0)
Add Comment