Hero Chaitanya Thandel : హైలెస్సో హైలెస్సా గుండెల్లో గిలిగింత‌

సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ అదుర్స్

Thandel : ఏ చిత్ర‌మైనా స‌క్సెస్ సాధించాలంటే క‌థే కాదు దానికి త‌గ్గ‌ట్టు గుండెల‌ను మీటే పాట‌లు కూడా ఉండాలి. ఇందు కోసం ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తారు. తాజాగా నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్న తండేల్+(Thandel) మూవీ హాట్ టాపిక్ గా మారింది. చిత్రానికి సంబంధించి ఇంకా విడుద‌ల కాకుండానే పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది.

Thandel Movie Song Updates

సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది నేచుర‌ల్ బ్యూటీగా పేరు పొందిన సాయి ప‌ల్ల‌వి. శేఖ‌ర్ క‌మ్ముల మూవీలో అద్భుతంగా స్క్రీన్ షేర్ చేసుకుంది అక్కినేని నాగ చైత‌న్యతో. ఈజాగా తండేల్ చిత్రానికి సంబంధించిన పాట‌లు, పోస్ట‌ర్స్ విప‌రీతంగా జ‌నాన్ని ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌ధానంగా మ‌రోసారి మెలోడీ సాంగ్స్ తో గుండెల‌ను మీటే ప్ర‌య‌త్నం చేశాడు రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్.

త‌న కాంబినేష‌న్ లో ఒక్క పాటైనా గేయ ర‌చ‌యిత శ్రీ‌మ‌ణితో రాయించ‌డం పెట్టుకున్నాడు. ఇక తండేల్ మూవీలో స‌ముద్రం సాక్షిగా హైలెస్సో హైలెస్సా అనే పాట‌ను రాశారు. ద‌ర్శ‌కుడు చందూ మొండేటి అద్భుతంగా చిత్రీక‌రించాడు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియుల‌ను, ప్ర‌త్యేకించి యూత్ ను ఆక‌ట్టుకుంటోంది. దీనిని నికాష్ అజీజ్ , శ్రేయా ఘోష‌ల్ అద్భుతంగా ఆలాపించారు. మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ వ‌స్తున్నాయి. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

Also Read : Anil Ravipudi Shocking : కంటెంట్ కీల‌కం సినిమాకు ప్రాణం

CinemaThandelTrendingUpdates
Comments (0)
Add Comment