Hero Santhanam : కోలీవుడ్ హీరో సంతానంపై సీరియ‌స్

శ్రీ‌నివాస గోవింద పాట‌కు అవ‌మానం

Santhanam : కోలీవుడ్ హీరో సంతానంపై భ‌గ్గుమంటున్నారు శ్రీ‌వారి భ‌క్తులు. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నారు. ఆయ‌న‌ను స్మ‌రించుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుతాయ‌ని, స‌మ‌స్య‌లు పోతాయ‌ని, శాంతి ల‌భిస్తుంద‌ని, అష్ట ఐశ్వ‌ర్యాలు ల‌భించేలా చేస్తాడ‌ని న‌మ్ముతారు. భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా , తిరుమ‌ల శ్రీ‌వారిని అవ‌మానించేలా శ్రీ‌నివాస గోవింద పాట‌ను పేర‌డీ చేశారంటూ భ‌క్తులు భ‌గ్గుమంటున్నారు. ఈ మేర‌కు హీరో సంతానంపై(Santhanam) చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు అందాయి.

TTD Devotes slams Santhanam

ఇదిలా ఉండ‌గా మంగళ‌వారం హిందూ సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. బేష‌ర‌తుగా కోలీవుడ్ హీరో సంతానం క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేన‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించాయి. డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేయ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. సినిమాలో పాట‌ను వెంట‌నే తొల‌గించాల‌ని లేక పోతే పుట్ట‌గ‌తులు ఉండ‌వంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో వివాదం ముద‌ర‌డంతో మీడియా ముందుకు వ‌చ్చాడు హీరో సంతానం. కావాల‌ని తాను కానీ, త‌మ సినిమా టీం కానీ తిరుమ‌ల శ్రీ‌వారిని అవ‌మానించ లేద‌ని చెప్పాడు. సెన్సార్ బోర్డు రూల్స్ మేర‌కే సినిమా తీశామ‌న్నారు.

Also Read : Beauty Kayadu Lohar :బంప‌ర్ ఆఫ‌ర్స్ క‌యాదు ఖుష్

SanthanamShockingUpdatesViral
Comments (0)
Add Comment