Honeymoon Express Movie : ఆర్జీవీ చేతులమీదగా విడుదల చేసిన 1st సాంగ్ ‘నిజామా’

పాట విన్న తరవాత రామ్ గోపాల్ వర్మ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు

Honeymoon Express Movie : చైతన్యరావు, హెబా పటేల్ జంటగా ఓ ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించిన హనీమూన్ ఎక్స్ ప్రెస్ చిత్రానికి బాల రాజశేఖర్ దర్శకుడు. గతంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అతను అనేక సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం బాల రాజశేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్టైన్మెంట్స్ (యూఎస్‌ఏ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తీస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖా వాణి, రవివర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని మొదటి పాట ‘నిజామా’ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంగళవారం విడుదల చేశారు. ప్రముఖ గాయని సునీత పాడిన అందమైన ప్రేమ గీతం.

Honeymoon Express Movie Song Release

పాట విన్న తరవాత రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తన మిత్రుడు బాల దర్శకత్వం వహించిన “హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌` సినిమాలోని “నిజామా` పాట చాలా బాగుంది. పాటలు చాలా అందంగా రికార్డ్ చేసారు. కెమెరా వర్క్ మరియు లొకేషన్ రెండూ చాలా బాగున్నాయి. నేను దాని గురించి ఇప్పుడే విన్నాను. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.

అనంతరం దర్శకుడు బాల రాజశేకర్ మాట్లాడుతూ… రామ్ గోపాల్ వర్మతో కలిసి రెండు హాలీవుడ్ చిత్రాల్లో పనిచేసాను. ఆయనతో `బ్యూటీ ఆఫ్ ప్యాషన్`, “అట` అనే రెండు సినిమాల్లో పనిచేసాను. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఆర్జీవీ మాకు స్ఫూర్తి. ‘శివ’ సినిమా నాకు దర్శకుడిగా మారడానికి స్ఫూర్తినిచ్చింది. “హనీమూన్ ఎక్స్ ప్రెస్` మంచి రొమాంటిక్ కామెడీ. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను త్వరలో విడుదల చేస్తాం” అన్నారు.

రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెకెఆర్, బాల్‌రాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శిష్ట్లా VMK, ఎడిటింగ్: ఉమాశంకర్, PRO: పాల్ పవన్. తొలి దశ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Also Read : Jai Hanuman : ప్రశాంత్ వర్మ బలరాముని ప్రాణప్రతిష్ట రోజు ప్రకటించిన మరో సినిమా

NewRam Gopal VarmaSongTrendingUpdates
Comments (0)
Add Comment