Operation Sindoor Sensational :ఆప‌రేష‌న్ సిందూర్ కొన‌సాగిస్తాం

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ప్ర‌క‌ట‌న

Operation Sindoor  : ఢిల్లీ – భారత్‌-పాకిస్థాన్​ ఉద్రిక్తతల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌‘ కొనసాగుతోందని వెల్లడించింది. దీనిలో భాగంగా తమకు అప్పగించిన పనులను అద్భుత నైపుణ్యాలతో అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసినట్లు తెలిపింది. ఆపరేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నందున తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. అప్పటి వరకు తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని వాయుసేన విజ్ఞప్తి చేసింది.

Operation Sindoor Continues..

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో ఏప్రిల్​ 22న ఉగ్రవాదులు పాశవికంగా పర్యటకులపై కాల్పులు తెగబడి 26మంది పొట్టనపెట్టుకున్నారు. దీంతో దేశం మొత్తం ఆగ్రహంతో రగిలి పోయింది. దీంతో భారత సైన్యం మే 6, 7 రాత్రి పాక్​, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత పాకిస్థాన్​- భారత సరిహద్దు ప్రాంతాలు లక్ష్యంగా కాల్పులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.

ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుల్వామా ఘ‌ట‌న‌లో త‌మ ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌క‌టించాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా సాక్షిగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Kamal Haasan- Thug Life :థ‌గ్ లైఫ్ ఆడియో రిలీజ్ వాయిదా

Indian AirforceInternational NewsOperation SindoorUpdatesViral
Comments (0)
Add Comment