IC 814 The Kandahar Hijack: థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ గా ఓటీటీలోనికి ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌’ !

థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ గా ఓటీటీలోనికి ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌’ !

IC 814 The Kandahar Hijack: 1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో 188 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది సుమారు 7రోజులు పాటు బందీలుగా ఉంచారు. ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ ఉదంతాన్ని అనుభవ్‌ సిన్హా ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సిరీస్‌ ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌(IC 814 The Kandahar Hijack)’. అనుభవ్‌ సిన్హా దీన్ని రూపొందిస్తున్నారు. విజయ్‌ వర్మ, అరవింద్‌ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

IC 814 The Kandahar Hijack…

హైజాక్ మొదలైన దగ్గరి నుంచి ఆ తర్వాత ఢిల్లీలోని వార్‌రూమ్‌లో జరిగిన ఘటనలను చూపిస్తూ ట్రైలర్‌ మొదలు పెట్టారు. మొదట అమృత్‌సర్‌ కి విమానాన్ని తీసుకెళ్లిన హైజాకర్లు… తర్వాత దానిని దుబాయ్‌కు అనంతరం కాంధార్‌ కు ఎందుకు తరలించారు ? అందులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆద్యంతం ఉత్కంఠగా తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు 29వ తేదీ నుంచి ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్‌ ఇన్‌ టూ ఫియర్ ’ ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు.

Also Read : Vijay: విజయ్ ‘గోట్‌’ సినిమాకు 6 వేల థియేటర్లు !

IC 814 The Kandahar Hijacknetflix
Comments (0)
Add Comment