Icon Star Allu Arjun: అల్లు అరవింద్ కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్… ట్వీట్ వైరల్!

అల్లు అరవింద్ కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్... ట్వీట్ వైరల్!

Icon Star Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ మారిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… తన తండ్రి అల్లు అరవింద్ కు పుట్టిన రోజు సందర్భంగా ఎక్స్ వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే డాడ్ అంటూ గీతా ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఆఫీస్ చైర్ లో అల్లు అరవింద్ కూర్చుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అనేక బహిరంగ వేదికలపై తన తండ్రిపై ఉండే ప్రేమను వ్యక్త పరుస్తూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనితో ఈ సారి పుట్టిన రోజు శుభాకాంక్షలను చాలా సింపుల్ గా, స్వీట్ గా చెప్పడం పట్ల అల్లు అర్జున్ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు సింప్లీ సూపర్బ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Icon Star Allu Arjun Wishes

అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఆఫీస్ లో కూర్చుని ఉన్న ఫోటోను అల్లు అర్జున్ పోస్ట్ చేయడం ద్వారా తన తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినట్లు అవుతోంది. అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్- బన్నీ కాంబినేషన్‌లో పుష్ప పార్ట్‌-1 సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుందని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించిన విషయం విదితమే.

Also Read : Mahesh Babu: మహేశ్‌ బాబు అభిమానులపై నమ్రత ఆసక్తికర పోస్ట్‌

Allu Aravindallu arjun
Comments (0)
Add Comment