Imanvi : పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన అనంతరం దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల మోత కొనసాగుతోంది. ఈ తరుణంలో పాకిస్తాన్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన నటీ నటులు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఇండియాలో చోటు లేదంటూ ఇప్పటికే కేంద్ర సమాచార శాఖ స్పష్టం చేసింది. ఈ తరుణంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఫౌజీ. ఇందులో ఇమాన్వీ ఇస్మాయిల్(Imanvi) కీలక పాత్ర పోషిస్తోంది.
Imanvi Ismail Responds
దీంతో సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం ప్రారంభించారు. తను పాకిస్తాన్ దేశానికి చెందినదని, ఆమెను వెంటనే సినిమాలోంచి తీసి వేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో తన పట్ల సీరియస్ కామెంట్స్ చేయడం, ట్రోల్ కు గురి కావడంతో తీవ్రంగా స్పందించింది ఇమాన్వీ ఇస్మాయిల్. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని పేర్కొనడం దారుణమన్నారు. ఎలాంటి సంబంధం ఆ దేశంతో లేదని స్పష్టం చేసింది నటి.
ఇమాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి తన కథలోని భాగాన్ని వివరించే ప్రయత్నం చేశారు. తాను పాకిస్తాన్ జాతీయురాలిని కాదని, పక్కా ఇండియన్ అమెరికన్ అంటూ వెల్లడించింది. కావాలంటే ఆధారాలు కూడా సమర్పించేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకలను చంపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని స్పష్టం చేసింది. తన కుటుంబానికి పాకిస్తాన్ సైన్యంతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి పేర్కొంది.
Also Read : Hero Ajith- Good Bad Ugly OTT :మే 8న ఓటీటీలో గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్
Beauty Imanvi Responds :నేను పాకిస్తానీ కాదు ఇండియన్ అమెరికన్
స్పష్టం చేసిన ఫౌజీ నటి ఇమాన్వీ ఇస్మాయిల్