Madam Movie- Shocking Teaser :భ‌య‌పెట్టిస్తున్న ‘మ‌దం’ టీజ‌ర్

కీల‌క పాత్ర‌లో ఇన‌య సుల్తానా

Madam : హ‌ర్ష గంగ‌వ‌ర‌పు, ల‌తా విశ్వ‌నాథ్ , ఇన‌య సుల్తానా(Inaya Sultana) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌దం మూవీ టీజ‌ర్ విడుద‌లైంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా దీనిని తెర‌కెక్కించారు. ఏకైవ హోమ్స్ ప్రై.లి. బ్యానర్ మీద సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించారు ఈ చిత్రాన్ని.

Madam Movie Updates

వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేయబోతోన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను తండేల్ సినిమాతో పాటుగా థియేటర్లలో యాడ్ చేశారు. ప్రస్తుతం మదం మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

మ‌దం పూర్తిగా గ్రామీణ నేప‌థ్యంగా సాగే మూవీ ఇది అని చెప్పారు ద‌ర్శ‌కుడు. ఇటువంటి కంటెంట్ తమిళ, మలయాళ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. తాను ‘మధం’ కథతో కనెక్ట్ అయ్యానని, క్లైమాక్స్ భారతీయ సినిమాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడనిద‌న్నారు ద‌ర్శ‌కుడు.

ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాల‌న్నారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ ఇన‌య సుల్తానా ప్ర‌తికూల పాత్ర‌ను పోషించింద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా త‌న‌కు ముందు నుంచి హీరోయిన్ పాత్ర‌ల కంటే ప్ర‌తి నాయ‌కి (విల‌న్ ) పాత్ర‌లో చేయ‌డ‌మంటే ఇష్ట‌మ‌న్నారు ఇన‌య సుల్తానా. ఇంకో పాత్ర పోషించిన న‌టి ల‌తా విశ్వ‌నాథ్ మాట్లాడుతూ త‌న నిజ జీవితంలోని వ్య‌క్తిత్వానికి ద‌గ్గ‌రగా ఉంద‌న్నారు.

Also Read : Prudhvi Raj Shocking :మ‌న‌సు నొప్పిస్తే  మ‌న్నించండి 

CinemaMadamTeaserUpdatesViral
Comments (0)
Add Comment