Abir Gulaal Movie Banned : అబీర్ గులాల్ మూవీపై నిషేధం

పాక్ న‌టుడు ఫ‌వాద్ ఖాన్ కీ రోల్

Abir Gulaal : జ‌మ్మూ కాశ్మీర్ లోని అనంత‌నాగ్ జిల్లా పెహ‌ల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో 26 మందికి పైగా ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఈ మేర‌కు కేంద్ర స‌ర్కార్ సీరియ‌స్ అయ్యింది. పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పూర్తిగా ఆ దేశానితో సంబంధాలు క‌ట్ చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే త‌గిన రీతిలో బుద్ది చెబుతామంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. పాకిస్తాన్ పై యుద్దం ప్ర‌క‌టించాలంటూ డిమాండ్ పెరుగుతోంది.

Abir Gulaal Movie Banned in India

ఈ త‌రుణంలో ఈ నిర్ణ‌యం సినిమా రంగంపై కూడా ప‌డింది. తాజాగా పాకిస్తాన్ కు చెందిన న‌టుడు ఫ‌వాద్ ఖాన్ కీ రోల్ పోషించాడు అబీర్ గులాల్(Abir Gulaal) మూవీలో. ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో విడుద‌ల చేసే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేసింది పిల్మ్ ఫెడ‌రేష‌న్. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఏప్రిల్ 1న విడుద‌లైంది. మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో అనుకోకుండా ఉగ్ర దాడి జ‌ర‌గ‌డంతో కొంత ఉత్కంఠ నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా భార‌తీయ చ‌ల‌న చిత్ర‌, టెలివిజ‌న్ డైరెక్ట‌ర్ల సంస్థ చీఫ్ అశోక్ పండిట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అబీర్ గులాల్ చిత్రాన్ని అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించాడు. ఈ సంఘ‌ట‌న ఒక్క‌టే కాదు .. ఈ దాడుల ప‌రంప‌ర గ‌త 30 ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తోంద‌ని అన్నాడు. యావ‌త్ సినీ ప్ర‌పంచం ఒక్క‌టిగా నిన‌దిస్తోంది. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తోంది. క‌ళాకారులు ఎవరైనా స‌రే పాకిస్తాన్ కు చెందిన ఏ సినిమాను ఇండియాలో ఆడ‌నిచ్చే ప్ర‌స‌క్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పండిట్.

Also Read : Shruti Haasan Shocking :నాన్నే నా లోకం లేక‌పోతే శూన్యం 

Pakistan ActorUpdatesViral
Comments (0)
Add Comment