Indias Got Latent : ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్ కు సంబంధించి తీవ్ర దుమారం రేపింది దేశ వ్యాప్తంగా. కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ వీడియోను వెంటనే తొలగించాలని సమాచార శాఖ ఆదేశించింది. ఈ మేరకు గూగుల్ చర్యలు తీసుకుంది. ఎపిసోడ్ వీడియోను తొలగించినట్లు ప్రకటించింది. పాడ్ కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన కామెంట్స్ తీవ్ర ఆగ్రహం తెప్పించేలా చేశాయి.
Indias Got Latent Video Removed
సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడిన మాటలు పలువురిని గాయం చేసింది. మహిళలు, పేరెంట్స్, యువత పూర్తిగా తల దించుకునేలా అభ్యంతరంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇందులో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.
ఇండియాస్ గాట్ లాటెంట్(Indias Got Latent) వీడియోపై ఫైర్ అయ్యింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ
శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు ప్రియాంక్ కనూంగో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇన్ స్టా గ్రామ్ లో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు , 1.05 కోట్ల మంది యూట్యూబ్ సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నాడు 31 ఏళ్ల పాడ్ కాస్టర్ , రోస్ట్ షోలో తన నీచపు వ్యాఖ్యలతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు.
మీ పేరెంట్స్ మీ జీవితాంతం ప్రతి రోజూ సెక్స్ చేయడం మీరు చూడాలని అనుకుంటున్నారా లేదా ఒకసారి చేరి దానిని శాశ్వతంగా ఆపుతారా అంటూ అడగడం తీవ్ర దుమారం రేపింది. ఇందుకు సంబంధించి అస్సాంతో పాటు ముంబైలోని అనేక పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై స్పందించారు సీఎం హిమంత బిస్వా శర్మ.
Also Read : Poonam Kaur Shocking :గురూజీ కాపీ మాస్టర్ పూనమ్ కౌర్ సెటైర్