Trisha : సోషల్ మీడియాలో సంచలనంగా మారారు కోలీవుడ్ కు చెందిన అందాల నటి త్రిష కృష్ణన్. తను పెళ్లి చేసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది. తను నటించిన చిత్రం థగ్ లైఫ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని దిగ్గజ దర్శకుడు మణిరత్నం తీశాడు. దీనికి కథతో పాటు ఓ పాట రాశాడు జన నాయగన్ కమల్ హాసన్. ఈ మూవీకి సంగీతం అందించాడు అల్లా రఖా రెహమాన్. ఇందులో త్రిషతో పాటు కమల్ , శింబు కీ రోల్స్ పోషించారు.
Trisha Krishnan Marriage Updates Viral
అయితే విచిత్రం ఏమిటంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత త్రిష(Trisha), శింబు కలిసి స్క్రీన్ పంచుకోవడం. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా గ్యాప్ వచ్చిందని, తామిద్దరం మంచి స్నేహితులమంటూ చెప్పింది అందాల ముద్దుగుమ్మ. మరో వైపు నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన సినిమా ఇది. వీరిద్దరి మధ్య 36 సంవత్సరాల అంతరం ఉండడం విస్తు పోయేలా చేసింది. ఇక త్రిష కృష్ణన్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించి వాకబు చేస్తున్నారు. తను తమిళ సూపర్ స్టార్ , టీవీకే చీఫ్ దళపతి విజయ్ తో డేటింగ్ చేస్తోందని, పీకల లోతు దాకా ప్రేమలో కూరుకు పోయిందని టాక్. దీనిపై ఇద్దరూ ఖండించ లేదు. స్పందించ లేదు.
విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం పాటు ఈ ఇద్దరూ కలిసి ఉన్నారు. కానీ ఎందుకనో తను దూరంగా ఉంటూ వచ్చారు. త్రిష కృష్ణన్ వల్లనే తను అలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై త్రిష కృష్టన్ కామెంట్ చేసింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. అయితే ఈ మధ్యన ప్రేమకు సంబంధించిన ఎమోజీలను, ఫోటో లను ఎక్కువగా షేర్ చేస్తోంది. అంటే తను ప్రేమలో ఉన్నట్టేనని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
Also Read : Mad Square OTT Sensational :ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో మ్యాడ్ స్క్వేర్