IT Raids Shocking Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడుల క‌ల‌క‌లం

కొన‌సాగుతున్న సోదాలు..త‌నిఖీలు

Tollywood : లెక్క‌కు మించి ఆదాయం క‌లిగి ఉన్నార‌నే దానిపై ఐటీ శాఖ రంగంలోకి దిగింది. నిన్న ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ , సింగ‌ర్ సునీత భ‌ర్త కంపెనీపై కూడా దాడులు చేప‌ట్టింది. దిల్ రాజు, భార్య తేజ‌స్విని, కొడుకు శిరీశ్ రెడ్డి, త‌న‌యురాలు స్నేహితా రెడ్డిలతో పాటు బంధువుల‌పై ఏక కాలంలో సోదాలు చేప‌ట్టింది. మొత్తం ఎనిమిది చోట్ల విస్తృతంగా దాడులు చేప‌ట్టింది. ఐటీకి చెందిన 55 మంది అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి.

Tollywood IT Raids..

రెండో రోజూ కూడా ఐటీ దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. దీంతో ఒక్క‌సారిగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎవ‌రూ కూడా బ‌య‌ట ప‌డ‌డం లేదు. మ‌రో వైపు పూర్తి లెక్క‌లు ఇచ్చామ‌ని వెల్ల‌డించారు దిల్ రాజు. తాను విజ‌య్ తో తీసిన వారిసు మూవీ పూర్తిగా న‌ష్టం వ‌చ్చింద‌న్నారు. రూ. 40 కోట్లు విజ‌య్ కి, 60 కోట్లు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇచ్చాన‌ని ఐటీ శాఖ‌కు తెలిపారు.

మ‌రో వైపు మైత్రీ మూవీ మేక‌ర్స్ , మ్యాంగో మీడియా సంస్థ‌లలో ఐటీ అధికార‌లు త‌నిఖీలు చేప‌ట్టారు. పుష్ప , పుష్ప‌-2 మూవీ చిత్రాల‌కు సంబంధించిన బ‌డ్జెట్ , వ‌చ్చిన ఆదాయం దాని గురించి ఆరా తీశారు.

దిల్ రాజు, న‌వీన్ ఎర్నేని స‌మ‌ర్పించిన డాక్యుమెంట్స్ పెద్ద ఎత్తున ఉండ‌డంతో ఇవాళ కూడా దాడులు చేప‌ట్టారు. సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

Also Read : Hero Vijay Varisu Movie : విజ‌య్ వారిసు భారీ లాస్

dil rajuIT RaidsUpdatesViral
Comments (0)
Add Comment