Jabardasth Rakesh : శుభవార్త చెప్పనున్న జబర్దస్త్ రాకింగ్ రాకేష్, సుజాత

సుజాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తుంది...

Jabardasth Rakesh : జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాకింగ్ రాకేష్. తన కేమేదీ స్కిట్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే పలు టీవీ షోలు కూడా చేస్తున్నాడు రాకేష్(Rocking Rakesh). రాకేష్, జోరుదార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి జబర్దస్త్‌తో పాటు పలు టీవీ షోల్లోనూ పాల్గొన్నారు. సుజాత కెరీర్ బిగినింగ్‌లో న్యూస్ ప్రజెంటర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సుజాత. ఇక ఈ జంట లవ్లీ కపుల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాకెష్, సుజాత. ఇక ఇప్పుడు ఈ జంట ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Jabardasth Rakesh…

సుజాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తుంది. ఈ ఛానెల్ లో తన లైఫ్‌లో జరిగిన విషయాలతో పాటు రకరకాల విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ కపుల్ తాము త్వరలోనే అమ్మ నాన్న కాబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సుజాత మాట్లాడుతూ.. ఓ మంచి సందర్భంగా చూసి ఈ సంతోషకరమైన విషయాన్నీ చెప్పాలనుకున్నాను.. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. రాకింగ్ రాకేష్ తండ్రి కాబోతున్నాడు అని సుజాత చెప్పగానే రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. అలాగే సీమంతం జరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ ఆనందాన్ని తమ ఫాలోవర్స్, ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఈ లవ్లీ కపుల్. ఇప్పుడు ఈ ఇద్దరికీ నెటిజన్స్ విషెస్ తెలుపుతున్నారు. రాకేష్ ప్రస్తుతం ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్‌తో ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చెప్పించారు. అమ్మ అనే పిలుపునకు దగ్గరిలో అంటూ ఓ సుజాత షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Also Read : Raayan: 8 రోజుల్లో వంద కోట్ల క్లబ్‌ లో చేరిన ధనుష్ ‘రాయన్‌’ !

Jabardasth Comedy ShowRocking RakeshTrendingUpdatesViral
Comments (0)
Add Comment