Jailer Box Office : ర‌జ‌నీకాంత్ జైల‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

రూ. 612 కోట్లు దాటిన యాక్ష‌న్ మూవీ

Jailer Box Office : క్రియేటివ్, డైన‌మిక్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ మూవీ దుమ్ము రేపుతోంది. ఆశించిన దానికంటే వ‌సూళ్లు సాధిస్తూ దూసుకు పోతోంది. ప్ర‌త్యేకించి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మేన‌రిజాన్ని అద్భుతంగా తెర మీద ప్ర‌ద‌ర్శింప చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు డైరెక్ట‌ర్.

Jailer Box Office Collections

త‌లైవా ర‌జ‌నీకాంత్ తో పాటు అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ , మ‌ల‌యాళ దిగ్గ‌జ న‌టుడు మోహ‌న్ లావ్, సినీ న‌టి ర‌మ్య కృష్ణ‌తో పాటు స్టార్ క‌మెడియ‌న్ యోగి బాబు జైల‌ర్(Jailer) లో న‌టించి మెప్పించారు.

ఆగ‌స్టు 10న విడుద‌లైన జైల‌ర్ బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఏకంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 612 కోట్లు వ‌సూలు చేసింది. రికార్డుల మోత మోగిస్తోంది. ఇక సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే 1వ వారంలో రూ. 450.80 కోట్లు వ‌సూలు చేసింది. 2వ వారంలో రూ. 124.18 కోట్లు కొల్ల‌గొట్టింది.

3వ వారంలో జైల‌ర్ కు సంబంధించి చూస్తే 1వ రోజు రూ. 7.67 కోట్లు, 2వ రోజు రూ. 6.03 కోట్లు, 3వ రోజు రూ. 8.36 కోట్లు, 4వ రోజు రూ. 10.25 కోట్లు, 5వ రోజు రూ. 5.12 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా జైల‌ర్ సినిమా రూ. 612.41 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు కొల్ల‌గొడుతుందో వేచి చూడాలి.

Also Read : Mahesh Babu Foundation : మహేష్ బాబు ఫౌండేషన్ చేయూత‌

jailer box office rajinikanth tamanna bhatia nelson dileep kumar
Comments (0)
Add Comment