Jailer Record : త‌మిళ నాట జైల‌ర్ రికార్డ్

రూ. 222 కోట్ల క‌లెక్ష‌న్స్

Jailer Record : త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మేనియా మామూలుగా ఉండ‌డం లేదు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ మూవీ ఆగ‌స్టు 10న విడుద‌లైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిసింది. ఇప్ప‌టికే రూ. 600 కోట్ల మైలు రాయిని దాటేసింది.

Jailer Record Breaking Movie

ప్ర‌స్తుతం ఒక్క త‌మిళ‌నాడు రాష్ట్రంలో జైల‌ర్ క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఈరోజు వ‌ర‌కు చూస్తే క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ఏకంగా రూ.222 కోట్ల‌ను సాధించింది. మూవీ మేక‌ర్స్ తో పాటు ర‌జ‌నీకాంత్ ను, నిర్మాత‌ల‌ను విస్తు పోయేలా చేసింది.

జైల‌ర్(Jailer) లో ర‌జ‌నీకాంత్ తో పాటు ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా, యోగి బాబు, శివ రాజ్ కుమార్ , మోహ‌న్ లాల్ న‌టించారు. త‌మిళ‌నాడులో ఓనం పండుగ సంద‌ర్బంగా మ‌రింత క‌లెక్ష‌న్లు వ‌చ్చేలా చేశాయి.

క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే 1వ వారంలో రూ. 150.02 కోట్లు, 2వ వారంలో రూ. 42.83 కోట్లు సాధించ‌గా 3వ వారంలో ఒక‌ట‌వ రోజు రూ.2.95 కోట్లు, 2వ రోజు రూ. 2.64 కోట్లు, 3వ రోజు రూ. 4.72 కోట్లు, 4వ రోజు రూ. 5.90 కోట్లు, 5వ రోజు రూ. 2.07 కోట్లు, 6వ రోజు రూ. 2.52 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా 222.65 కోట్ల కొల్ల‌గొట్టింది.

Also Read : Kalki 2898 AD : శ‌ర వేగంగా కల్కి 2898 ఏడీ షూటింగ్

Comments (0)
Add Comment