Jailer Movie : ర‌జ‌నీ మేనియా మామ‌లుగా లేదుగా

18 రోజులు రూ. 600 కోట్లు

Jailer Movie : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూపర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ , ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ఆగ‌స్టు 10న జైల‌ర్ విడుద‌లైంది. ఆనాటి నుంచి నేటి దాకా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Jailer Movie Trending

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన 18 రోజుల‌లో ఏకంగా రూ. 600 కోట్లకు పైగా కొల్ల‌గొట్టింది వ‌ర‌ల్డ్ వైడ్ గా . ర‌జ‌నీకాంత్ మేనియా దెబ్బ‌కు బాక్సులు బ‌ద్ద‌ల‌య్యాయి. ప్ర‌త్యేకించి నెల్స‌న్ దిలీప్ కుమార్ టేకింగ్ , మేకింగ్ జైల‌ర్(Jailer) కు అద‌న‌పు బలాన్ని ఇచ్చేలా చేసింది.

72 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రోసారి స‌త్తా చాటాడు. త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించాడు. జైల‌ర్ సాధించిన విజ‌యంపై త‌లైవా స్పందించాడు. త‌న సినీ జీవితంలో అత్యంత ఆనందానికి లోనైన స‌న్నివేశం ఏదైనా ఉందంటే అది జైల‌ర్ చిత్రం స‌క్సెస్ అన్నాడు.

క‌థ బ‌లంగా ఉంటే హీరోల‌తో ప‌ని ఉండ‌ద‌ని త‌న సినిమాతో అర్థ‌మై పోయింద‌న్నారు. మంచి క‌థ‌, చిత్రీక‌ర‌ణ అద్భుతంగా ఉంటే సినిమా స‌క్సెస్ కు ఢోకా ఉండ‌ద‌న్నారు ర‌జ‌నీకాంత్. తాను నిమిత్త మాత్రుడిన‌ని , అంతా పై వాడు దేవుడు చూసుకుంటాడ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Krithi Shetty Vs Nabha Natesh

jailer movie rajinikanth thamanna bhatia rs 600 crorres
Comments (0)
Add Comment