Jailer Record : తమిళ నాట త‌లైవా పాట

జైల‌ర్ మూవీ వసూళ్ల వేట

Jailer Record : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా న‌టించిన జైల‌ర్ మూవీ దుమ్ము రేపుతోంది. వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 600 కోట్ల‌కు పైగా కొల్ల గొట్టింది. ఆగ‌స్టు 10న విడుద‌లైంది ఈ చిత్రం. త‌మిళ‌నాడులో రిలీజైన నాటి నుంచి నేటి వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది.

Jailer Record Trending

కోలివుడ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ర‌జ‌నీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది జైల‌ర్(Jailer). రూ. 232 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించి సినీ ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. 1వ వారంలో రూ. 159.02 కోట్లు వ‌సూలు చేసింది. 2వ వారంలో రూ. 42.83 కోట్లు , 3వ వారంలో రూ. 22.75 కోట్లు వ‌సూళ్లు సాధించింది జైల‌ర్.

ఇక 4వ వారంలో 1వ రోజు రూ.1.70 కోట్లు, 2వ రోజు రూ. 1.70 కోట్లు, 2వ రోజు రూ. 1.04 కోట్లు, 3వ రోజు రూ. 1.81 కోట్లు, 4వ రోజు రూ. 2.07 కోట్లు, 5వ రోజు రూ. 096 కోట్లు, 5వ రోజు రూ. 0.81 కోట్లు సినిమా సాధించింది. మొత్తంగా జైల‌ర్ రికార్డు బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 232.99 కోట్లు సాధించింది. ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ కావ‌డంతో నిర్మాత , డీఎంకే ఎంపీ క‌ళానిధి మార‌న్ ఆనందం వ్య‌క్తం చేశారు.

డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ కు బ్లాంక్ చెక్ తో పాటు విలువైన కారు అంద‌జేశారు. ర‌జ‌నీకాంత్ కు రూ. 100 కోట్ల చెక్ తో పాటు కోటిన్న‌ర బీఎండ‌బ్లూ ఇచ్చారు. సినిమాకు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ ర‌విచంద‌ర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ అంద‌జేశారు.

Also Read : Malaika Arora Vs Meenakshi Chaudhary

Comments (0)
Add Comment