Jailer Producer Gift : ర‌జ‌నీకాంత్ కు బీఎండ‌బ్ల్యూ కారు గిఫ్ట్

రూ. 650 కోట్ల‌కు పైగా మూవీ వ‌సూళ్లు

Jailer Producer Gift : నెల్స‌న్ దిలీప్ కుమార్ ర‌జ‌నీకాంత్ తో తీసిన జైల‌ర్ చిత్రం వ‌సూళ్ల‌లో సునామీ సృష్టిస్తోంది. ఆగస్టు 10న విడుద‌లైన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 650 కోట్లు కొల్ల‌గొట్టింది. మూవీని నిర్మించిన స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ కు భారీ ఆదాయం స‌మ‌కూరింది. క‌ళా నిధి మార‌న్(Kalanithi Maran) త‌లైవా ర‌జ‌నీకాంత్ కు ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చారు.

Jailer Producer Gift to Thalaivaa

రూ.100 కోట్ల చెక్కును అంద‌జేశారు. అంతే కాదు రూ. 1.50 కోట్లు ఖ‌రీదు చేసే బీఎండ‌బ్ల్యూ ఎక్స్7 కారును గిఫ్ట్ గా ఇచ్చారు. నిర్మాత త‌నకు వ‌చ్చిన లాభాల్లో వాటాగా వీటిని అంద‌జేశారు. ర‌జ‌నీకాంత్ సూప‌ర్ స్టార్ కాదు, మెగా స్టార్ కూడా కాదు. ఒక లెజెండ్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఆయ‌న వ‌య‌సు 72 ఏళ్లు. ఈ వ‌య‌సులో కూడా ఆయ‌న యువ హీరోలకు పోటీగా న‌టించారు. ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున జైల‌ర్ క‌లెక్ష‌న్లు కురిపిస్తున్నాయి. త‌మిళ నాట రూ. 225 కోట్లు వ‌సూలు చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ స‌క్సెస్ ఫుల్ చిత్రంగా వినుతికెక్కింది. స‌న్నీ డియోల్ న‌టించిన గ‌ద‌ర్ -2 తో పోటీ ప‌డింది. అయినా జైల‌ర్ టాప్ లో నిలిచింది వ‌సూళ్ల ప‌రంగా. స‌న్ పిక్చ‌ర్స్ ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా తెలిపింది.

Also Read : Nelson Dilipkumar : త‌లైవాను మ‌రిచి పోలేను

Comments (0)
Add Comment