Jawan Trailer : బుర్జ్ ఖ‌లీఫాలో బాద్ షా సంద‌డి

డ్యాన్సుతో హోరెత్తించిన షారుక్

Jawan Trailer : యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ మూవీ సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే టికెట్లు కూడా పూర్త‌యి పోయాయి. ఓవ‌ర్సీస్ లో మ‌రోసారి స‌త్తా చాటాడు బాద్ షా.

Jawan Trailer Viral

ఇక దుబాయ్ లోని బుర్జ్ ఖ‌లీఫా వ‌ద్ద షారుక్(Shah Rukh Khan) జ‌వాన్ ను ప్ర‌ద‌ర్శించారు. ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. భారీ ఎత్తున ఫ్యాన్స్ అక్క‌డికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే పాట‌లు, పోస్ట‌ర్స్ , ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది.

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పేరుతో రూ. 200 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్ తో జ‌వాన్ ను నిర్మించారు. అట్లీపై ఉన్న న‌మ్మ‌కం వ‌మ్ము కాలేదు. ఇంకా సినిమా విడుద‌ల కాకుండానే ఏకంగా రూ. 350 కోట్లు ముంద‌స్తుగా వ‌సూలు కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు.

యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇచ్చిన మ్యూజిక్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు బాద్ షా. త‌న‌కు కొడుకు లాంటోడు అని కితాబు ఇచ్చాడు. ఇక బుర్జ్ ఖలీఫాలో జ‌వాన్ కు సంబంధించిన పాట‌కు డ్యాన్స్ చేశాడు షారుక్ ఖాన్.

Also Read : Kalanithi Maran : ర‌జ‌నీకి భారీ రెమ్యున‌రేష‌న్

Comments (0)
Add Comment