Beauty Janhvi Kapoor-Peddi :పెద్ది షూటింగ్ లో జాన్వీ క‌పూర్ బిజీ

రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి స్క్రీన్ షేర్

Janhvi Kapoor : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం పెద్ది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్, గ్లింప్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు చెర్రీ సైతం దీనిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. కార‌ణం ఏమిటంటే త‌ను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజ‌ర్ బిగ్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

Janhvi Kapoor Busy with Peddi Movie Shooting

ఇక బుచ్చిబాబుతో జ‌త‌కట్టాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇది పూర్తిగా గ్రామీణ క్రీడా నేప‌థ్యం క‌థ‌తో ముందుకు వ‌స్తోంది. ఇందులో చెర్రీతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్(Janhvi Kapoor), క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కీ రోల్స్ పోషించ‌నున్నారు. అంతే కాదు వీరితో పాటు జ‌గ‌ప‌తి బాబు, మీర్జా పూర్ ఫేమ్ దివ్వేందు శ‌ర్మ కూడా న‌టిస్తుండ‌డం విశేషం.

బుచ్చిబాబు స‌న టేకింగ్, మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం కొంత గ్యాప్ తీసుకున్నాడు. స‌మ్మ‌ర్ వెకేషన్ తో పాటు లండ‌న్ లో త‌న కోసం ఏర్పాటు చేసిన మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు. ఇందులో తాను ప్రేమించే కుక్క కూడా ఉండ‌డం విశేషం. టాలీవుడ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్, బ‌న్నీకి మాత్ర‌మే విగ్ర‌హాలు ఉండేవి. ఇప్పుడు వారి స‌ర‌న‌స చెర్రీ కూడా చేరాడు. ఇదిలా ఉండ‌గా ఈనెల 15 నుంచి తిరిగి పెద్ది షూడ్యూల్ ప్రారంభం అవుతుంద‌ని టాక్. ఇందులో చెర్రీతో పాటు జాన్వీ క‌పూర్ జాయిన్ కానుంద‌ని, సాంగ్స్ , కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Diljit Dosanjh Sensational :పంజాబ్ సింగ‌ర్ దిల్జిత్ దొసాంజ్ సెన్సేష‌న్

Global Star Ram CharanJanhvi KapoorPeddiUpdatesViral
Comments (0)
Add Comment