Janhvi Kapoor Shocking :యుద్దం వ‌ద్దు శాంతి ముద్దు

జాన్వీ క‌పూర్ తీవ్ర ఆవేద‌న

Janhvi Kapoor : భార‌త్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ త‌రుణంలో భార‌తీయ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. హృద‌య విదార‌క దృశ్యాలు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయ‌ని, వీటిని చూడ‌లేక పోతున్నామంటూ వాపోతున్నారు. వార్ ఎన్న‌టికీ ఆమోద యోగ్యం కాద‌న్నారు. శాంతితోనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుందంటున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా స్పందించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్.

Janhvi Kapoor Shocking Comments

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా యుద్దాన్ని ముగించాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ త‌రుణంలో తాను చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. వైర‌ల్ గా మారాయి. వివిధ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, డిజిట‌ల్ మాధ్య‌మాల‌లో చోటు చేసుకున్న దృశ్యాలు త‌న‌ను క‌లిచి వేశాయ‌ని పేర్కొన్నారు జాన్వీ క‌పూర్(Janhvi Kapoor). ఇటువంటి దారుణ‌మైన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌న్నారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది న‌టి.

దాడులు చేయ‌డం భార‌త దేశం అభిమ‌తం కాద‌న్నారు. ప్ర‌పంచ శాంతి కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న ఏకైక దేశం మ‌న‌దేన‌ని అన్నారు. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని తాను ఊహించ లేదన్నారు జాన్వీ క‌పూర్. దాయాది పాకిస్తాన్ త‌న తీరు మార్చుకోక పోవ‌డం వ‌ల్లే భార‌త్ ఎదురు దాడులు చేస్తోంద‌న్నారు. ఇండియా క‌య్యానికి కాలు దువ్వేందుకు ఎప్పుడూ ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని తెలిపింది ఈ న‌టి. మొత్తంగా త్వ‌ర‌లోనే ఈ ప‌రిస్థితుల నుంచి ఇరు దేశాలు బ‌య‌ట పడతాయ‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపింది \జాన్వీ క‌పూర్.

Also Read : Aarti Ravi Shocking :జ‌యం ర‌వి నిర్వాకం భార్య ఆగ్ర‌హం

CommentsJanhvi KapoorOperation SindoorPahalgam AttackShockingViral
Comments (0)
Add Comment