Janhvi Kapoor : ఎంత కష్టమైన పాత్రైనా చేయడానికి సిద్ధమంటున్న జాన్వీ కపూర్

ఏ రోల్‌ కోసమైనా హెయిర్‌ కట్‌ చేసుకోవద్దని చెప్పింది...

Janhvi Kapoor : బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ శుక్రవారం ఉలఝ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుిస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌, కథల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ” కెరీర్‌ను మార్చే అవకాశమైనా.. జుట్టు లేకుండా కనిపించే పాత్రను అంగీకరించను అన్నారు. ‘ ఎలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారు?’ అని యాంకర్‌ అడగ్గా జాన్వీ(Janhvi Kapoor) స్పందించారు. ‘‘ హెయిర్‌ లేకుండా నటించాల్సి వస్తే నేనెప్పుడూ సున్నితంగా తిరస్కరిస్తా. ఎంత కష్టమైన పాత్రైనా చేస్తాను కానీ జుట్టు లేకుండా కనిపించేందుకు ఇష్టపడను. ‘ ఉలఝ్‌’లోని పాత్ర కోసం దర్శకుడు నా హెయిర్‌ను కొంత కట్‌ చేయాలని సూచించారు.

Janhvi Kapoor Comment

అందుకు నేను ఆయనతో గొడవపడ్డా (నవ్వుతూ) నా తొలి సినిమా ‘ధడక్‌’ కోసం జుట్టు కత్తిరించుకున్నా. ‘ ఎందుకిలా చేశావ్‌?’ అంటూ మా అమ్మ అరిచింది. ఏ రోల్‌ కోసమైనా హెయిర్‌ కట్‌ చేసుకోవద్దని చెప్పింది. నా జుట్టంటే ఆమెకు అంత ఇష్టం. మూడ్రోజులకోసారి ఆయిల్‌ రాసి మసాజ్‌ చేేసది. అమ్మ కారణంగానే హెయిర్‌ కట్‌ చేసుకోను’’ అని అంది జాన్వీకపూర్‌. గుల్షన్‌ దేవయ్య, జాన్వీకపూర్‌, రోషన్‌ మాథ్యు కలిసి నటించిన చిత్రమిది. దేశభక్తి కథాంశంతో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ నేపథ్యంలో స?గే థ్రిల్లర్‌గా రూపొందింది. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో దేవర చిత్రంలో నటిస్తోంది. రెండు పార్టులుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తదుపరి రామ్‌చరణ్‌, సానా బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కే చిత్రంలో ఆమె అవకాశం అందుకుంది.

Also Read : Charuhasan : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు చారుహాసన్

CommentsJanhvi KapoorUpdatesViral
Comments (0)
Add Comment